వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఒక్కటి కాదు రెండు కాదు 500 లక్షల కోట్ల నష్టం, ప్రపంచ దేశాలపై కోవిడ్ దెబ్బ ఇదీ..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అసలే ఆర్థిక మందగమనంతో ఉన్న దేశాలు.. ఆర్థికంగా మరింత దిగజారాయి. కరోనా వైరస్ ప్రభావంపై ఐక్యరాజ్యసమతి నివేదిక విడుదల చేసింది. 25 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోతారు అని పేర్కొన్నది. ప్రపంచంలోనిమూడింత రెండొంతుల అభివృద్ధి చెందుతోన్న దేశాల కోసం 187 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నది.

10 మిలియన్ల ప్రజలు

10 మిలియన్ల ప్రజలు

ఐక్యరాజ్యసమితి నివేదిక ఇలా ఉంటే తూర్పు ఆసియా, ఆసియా ఫసిఫిక్ ప్రాంతాల్లో 10 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నది. బ్రిటీష్ థింక్ థాంక్ మాత్రం 300 మిలియన్ కోట్ల నష్టాలను కలిగించిందని అంచనా వేసింది. కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. కోలుకోవడానికి ఎన్నిరోజులు పడుతుందో తెలియదు.

పరిహారం ఎంతంటే..

పరిహారం ఎంతంటే..

ఈ సమయంలో ఒక ప్రశ్న తలెత్తింది. కరోనా వైరస్‌కు కారణమైన చైనాను ఇతర దేశాలు నష్టపరిహారం అడుగుతాయా అనే చర్చకు దారితీసింది. ఆయా దేశాలపై పెను ప్రభావం చూపేందుకు కారణమైన డ్రాగన్ కంట్రీని ఇతర దేశాలు అడుగుతాయా అనే ప్రశ్న మెదలుతోంది. ఒకవేళ ఆయాదేశాలు తమకు పరిహారం చెల్లించాలని కోరితే పరిస్థితి ఏంటీ, ఎంత మొత్తంలో చైనా చెల్లించాల్సి వస్తోంది.

అమెరికాకు 90 లక్షల కోట్లు..

అమెరికాకు 90 లక్షల కోట్లు..


హెన్రీ జాక్సన్ సొసైటీ అంచనా ప్రకారం .. చైనాను నష్టపరిహారం ఇవ్వాలని బ్రిటన్ కోరితే 34 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే అమెరికా విషయంలో అయితే రూ.90 లక్షల కోట్లు కట్టాలి. కెనడాకు 4.5 లక్షల కోట్లు, ఆస్ట్రేలియా 2.8 లక్షల కోట్లను డ్రాగన్ కంట్రీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా దేశాలతో కలిపితే చైనా చెల్లించాల్సిన మొత్తం 500 లక్షల కోట్లుగా ఉంటుందని సంస్థ లెక్కగట్టింది. అయితే ఇప్పటివరకు తమ దేశం నష్టపోయిన వివరాలను వెల్లడించలేదు. అలా ప్రకటిస్తే కరోనా వైరస్ రక్కసి కొట్టిన దెబ్బ స్పష్టమైన ఫిగర్ కనిపిస్తోంది.

English summary
A report released by the United Nations called ''COVID-19 and World Of Work' stated that pandemic would result in loss of about 25 million jobs worldwide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X