వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కనీవినీ ఎరుగని విధ్వంసం: అమెరికాలో ఒక్కరోజే 1169 మంది బలి: న్యూయార్క్, న్యూజెర్సీ కకావికలం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా తప్ప లేదు. వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవ రూపం దాల్చేలాగే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల రెండు లక్షల మంది మరణించే అవకాశం ఉందంటూ ఆ దేశ అధికారులు వేసిన లెక్కలు కూడా ఎక్కడా తప్పుగా కనిపించే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే- అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజే 1169 మంది కరోనా వైరస్‌కు బలి అయ్యారు.

జనగామలో కానిస్టేబుల్ నిర్వాకం: పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కుమార్తె పుట్టినరోజు వేడుకలు..!జనగామలో కానిస్టేబుల్ నిర్వాకం: పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కుమార్తె పుట్టినరోజు వేడుకలు..!

అమెరికా అల్లకల్లోలం..

అమెరికా అల్లకల్లోలం..

భయానక కరోనా వైరస్ బారిన పడి అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమౌతోంది. అమెరికాలో వైరస్ కనీవినీ ఎరుగని విధ్వంసానికి దిగింది. కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనా సహా ప్రపంచపటంలో ఉన్న అన్ని దేశాల్లో సంభవిస్తోన్న మరణాలు ఒక ఎత్తయితే.. అమెరికాలో కొనసాగుతోన్న విలయం మరో ఎత్తుగా మారింది. ఒక్కరోజులో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కరోనా మృతుల సంఖ్య నమోదు కావడం ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి. వెయ్యికి పైగా మరణాలు నమోదైన దేశాలు ఇప్పటిదాకా ఒక్కటీ లేదు.

అన్ని రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో..

అన్ని రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో..

అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 27 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిచిగాన్ రాష్ట్రాల్లో అయిదంకెలను ఎప్పుడో దాటేశాయి. ఒక్క న్యూయార్క్‌లోనే 93,053 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఉన్న తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. న్యూయార్క్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను అందుకోవడానికి ఎంతో సమయం పట్టదు. న్యూయార్క్‌లో కరోనా బారిన పడి ఇప్పటికే 2538 మంది మరణించారు. అమెరికాలో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రం ఇదే.

న్యూజెర్సీలో భయానకం..

న్యూజెర్సీలో భయానకం..

న్యూయార్క్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా మారింది న్యూజెర్సీ. ఈ రాష్ట్రంలో 25,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా 537 మంది మరణించారు. కాలిఫోర్నియా-11,027, మిచిగాన్-10,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. లూసియానా, ఫ్లోరిడా, మసాచ్చుసెట్స్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్క్‌ను అందుకోవడానికి అధిక సమయం తీసుకోకపోవచ్చు.

Recommended Video

Sonia Gandhi:'Modi Has No Planning For Present Situation'
రెండున్నర లక్షల మంది బాధితులు..

రెండున్నర లక్షల మంది బాధితులు..

కరోనా వైరస్ వల్ల ఒక్క అమెరికాలోనే కనీసం రెండున్నర లక్షల మంది మరణించే అవకాశం ఉందంటూ ఇదివరకే అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రతినిధులు అంచనా వేసిన విషయం తెలిసిందే. దీన్ని నిజం చేసేలా కనిపిస్తోంది అక్కడి పరిస్థితి. న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో మరణాల సంఖ్య అత్యధికంగా ఉండటానికి ప్రధాన కారణం.. సరైన వైద్య పరికరాలు లేకపోవడమేనని తెలుస్తోంది. వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడంతో చూస్తూ, చూస్తుండగానే కరోనా బాధితులు ప్రాణాలను వదిలేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,000లను దాటేసింది.

English summary
More than 1,000 died of Covid-19 in the United States as the death toll stood at 5,137 and the number of infections at 216,000 on Thursday. The country grappled with an unprecedented health crisis, including a huge shortage of medical supplies and protective equipment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X