వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ 19: వ్యాక్సీన్ తయారీలో ఎలాంటి వింత పదార్థాలు ఉపయోగిస్తారో తెలుసా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్యాక్సీన్

1925లో గాస్టన్ రామన్ ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేపట్టారు.

అంతకుముందు ఒక ఫ్రెంచ్ పశు వైద్యుడు గొంతు వాపు కోసం గుర్రాల మీద ప్రయోగించే వ్యాక్సీన్ కోసం పని చేశారు. గుర్రాలకు ఇంజక్షన్ చేసిన ప్రాంతంలో కురుపులు రావడం, రోగ నిరోధక శక్తి పెరగడం ఆయన గమనించారు. ఈ రోగ నిరోధక శక్తి మరింత పెరగడానికి వ్యాక్సీన్ తయారీలో ఇంకా ఏం కలపాలని ఆయన ఆలోచించడం మొదలు పెట్టారు.

ఆ తరువాత ఆయన వంటింట్లో లభించే చాలా రకాల ఆహార పదార్ధాలను వ్యాక్సీన్‌లో కలిపి పరీక్షించడం ప్రారంభించారు. ఆయన తన దగ్గరకు వచ్చే రోగులకు డిఫ్తీరియా వ్యాక్సీన్‌తో పాటు టపియోక, పిండి పదార్థాలు, అగర్, లెసిథిన్ లాంటి కొవ్వు పదార్ధాలు, చాక్లెట్‌లో లభించే నూనెలు, కొన్ని సార్లు రొట్టె పిండి లాంటివి కలిపి ఇంజెక్షన్లుగా ఇవ్వడం మొదలు పెట్టారు.

ఆయన చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. రామన్ తయారు చేసిన వ్యాక్సీన్లు ఇచ్చిన జంతువులు గణనీయంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి.

దీంతో ఔషధాలకు ఉత్ప్రేరకంగా పనిచేసే ఉత్పత్తులు మొదలయ్యాయి. వీటిని వ్యాక్సీన్లను మరింత ప్రభావవంతంగా పని చేసేందుకు వాడతారు. నేటికీ వీటిని విరివిగా వాడుతున్నారు.

వ్యాక్సీన్

ప్రస్తుతం వ్యాక్సీన్ల సామర్థ్యం పెంచేందుకు వాడుతున్న పదార్ధాలలో అల్యూమినియం ఒకటి. ఈ రసాయనాన్ని డిఫ్తీరియా, టెటనస్ , డీటీపీ , హెపటైటిస్-ఏ, బీ, ఎచ్‌పీవీ, జపనీస్ ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్, ఆంత్రాక్స్, న్యుమోకోకస్, హెమోఫిలస్ ఇన్ఫ్లూయెంజా టైప్ బి వ్యాక్సీన్లలో కూడా వాడతారు.

వ్యాక్సీన్లలో సహాయకారిగా వాడే ఇంకొక పదార్ధం స్క్వాలీన్. నూనె లాంటి ఈ పదార్ధాన్ని సొర చేప కాలేయం నుంచి, కిల్లజా అనే ఒక వృక్షం బెరడు నుంచి తీస్తారు. దీన్ని ఆండియా మపుచే ప్రజలు అనాదిగా సబ్బుల తయారీకి వాడుతున్నారు. ఈ బెరడును పొడి చేసి నీటిలో కలిపినప్పుడు నురుగలా వస్తుంది.

బ్యాక్టీరియా నుంచి వేరుపడిన తోకలు, బ్యాక్టీరియా చర్మంపై నుండే కంటికి కనిపించని కొన్ని రకాల సూక్ష్మ బ్యాక్టీరియాలను ఇటీవల కాలంలో కనుగొన్నారు. అయితే వీటి వాడకానికి ఇంకా లైసెన్సు లభించలేదు.

వ్యాక్సీన్ల వల్ల ఏటా 20 నుంచి 30 లక్షల మంది ప్రాణాలను రక్షించడమే కాకుండా, జీవితాంతం వెంటాడే శారీరక వైకల్యాలు రాకుండా అడ్డుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, వ్యాక్సీన్లలో వాడే ఈ సహాయక పదార్థాలు ఎంతవరకు సహకరిస్తున్నాయో చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఏమి లేవు.

కానీ, వ్యాక్సీన్లకు శరీరం ప్రతిస్పందించి, అనేక రోగాల నుంచి దీర్ఘ కాలం పాటు ప్రజలను రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ సహాయక పదార్థాలు లేకపోతే వ్యాక్సీన్లు అసలు పని చేయవు.

ఈ సహాయక పదార్థాలు లేకపోతే శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు కొన్ని వారాల్లో లేదా నెలల్లో మాయమైపోతాయి. ఈ సహాయక పదార్థాలు వ్యాక్సీన్లు పనిచేసే కాలాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి" అని డాలియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీర్ బింగ్ బింగ్ సన్ చెప్పారు.

ఆయన కొన్ని రకాల హెపటైటిస్ బి వ్యాక్సీన్లను ఈ సందర్భంగా ఉదహరించారు. "వ్యాక్సీన్లలో ఈ సహాయక పదార్థాలను కలపకపోతే యాంటీబాడీల ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కొన్నిసార్లు వాటికి యాంటీబాడీల ఉత్పత్తిని పెంచే సామర్ధ్యం కూడా ఉండదు" అని ఆయన అన్నారు.

వ్యాక్సీన్లలో ఈ విచిత్రమైన పదార్థాలను ఎందుకు కలుపుతున్నారు? అనే ప్రశ్న శతాబ్ద కాలంగా ఛేదించలేని ఒక రహస్యంలానే ఉంది. ఈ రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

వ్యాక్సీన్

పొరపాటు..

ఇలాంటి పదార్థాలను కలుపుతున్నారనే విషయం భయం కలిగించినప్పటికీ వీటి మోతాదు చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటుంది.

ఒక వ్యాక్సీన్ డోసులో 0.2 మిల్లీగ్రాముల అల్యూమినియం ఉంటుంది. అంటే, ఒక గసగసాల గింజ బరువు కంటే తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. వ్యాక్సీన్లలో ఉండే సహాయక పదార్థాల వల్ల ప్రతికూల ప్రభావాలు తలెత్తుతాయని చెప్పడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు.

నిజానికి వ్యాక్సీన్ల ద్వారా శరీరానికి రక్షణ కల్పించడానికే ఈ సహాయక పదార్థాలను ప్రవేశ పెట్టారు.

1970లల్లో పిల్లల నాడీ వ్యాధుల నిపుణుడు జాన్ విల్సన్ రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్‌లో ఒక ప్రసంగం చేస్తూ.. కోరింత దగ్గు కోసం ఇచ్చిన టీకా వల్ల 36 మంది పిల్లల్లో మెదడు దెబ్బ తిందని చెప్పారు. ఆ ప్రసంగం దశాబ్ద కాలం పాటు కొనసాగిన ఒక వివాదానికి తెర లేపింది.

ఆ కథను విలేకరులు అంది పుచ్చుకున్నారు. అదొక పూర్తి స్థాయి కుంభకోణంగా మారే లోపే ప్రైమ్ టైం సీరియల్స్‌లోనూ, పేపర్ ఫ్రంట్ పేజీ హెడ్‌లైన్లలోనూ వచ్చింది.

దీంతో యూకేలో కోరింత దగ్గు కోసం పిల్లలకు ఇచ్చే వ్యాక్సీన్ల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని దేశాలలో ఆ టీకాను వేయడం పూర్తిగా నిలిపేశారు.

అయితే, ఇందులో అసలు నిజం లేదు. ఆ టీకా మందును కొన్ని దశాబ్దాల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా వాడారు. ఆ టీకా మందు వల్ల స్వల్ప జ్వరం రావడం వాస్తవమే. కానీ, అదేదో ముప్పు తెచ్చే టీకా అని అందరూ భ్రమపడ్డారు. అయితే, చివరికి ఇది కొత్త తరహాలో వ్యాక్సీన్లు తయారు చేసేందుకు శాస్త్రవేత్తలను ప్రోత్సహించింది.

గతంలో చాలా రకాల వ్యాక్సీన్లు సూక్ష్మజీవులను బలహీనపరిచి, వాటి ప్రభావం తగ్గించి తయారు చేసేవారు. కోరింత దగ్గు కోసం తయారు చేసే వ్యాక్సీన్లలో ఈ సూక్ష్మజీవులను పూర్తిగా హతమార్చి వాడేవారు. దీన్ని టెటనస్, డిఫ్తీరియా వ్యాక్సిన్లతో కలిపి ఇచ్చేవారు.

ఈ వ్యాక్సీన్ల వల్ల కొన్ని సార్లు తాత్కాలిక ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తాయి. వాటి వల్ల దీర్ఘ కాలం పాటు ఉండే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సజీవ సూక్ష్మజీవులు ఉండే కొన్ని వ్యాక్సిన్ల వల్ల కొన్ని సంబంధం లేని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

ఇప్పుడు అనుసరిస్తున్న విధానం కొంచెం భిన్నమైనది. ఈ కోరింత దగ్గు భయం తరువాత, సూక్ష్మ జీవుల్లో కొన్ని రకాలను మాత్రమే అతి సూక్ష్మ పరిమాణంలో వాడటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త వ్యాక్సీన్లు సురక్షితమైనవని అంటారు.

అయితే అక్కడొక కిటుకు ఉంది, ఇలా తక్కువ పరిమాణంలో సూక్ష్మజీవులు ఉన్న వ్యాక్సీన్ల వల్ల పుట్టిన రోగ నిరోధక శక్తి ఎక్కువ కాలం రక్షణ ఇవ్వటం లేదు. దీంతో ఈ సమస్యను అధిగమించటానికి శాస్త్రవేత్తలు సహాయక పదార్థాలు వాడేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

వ్యాక్సీన్

అల్యూమినియంపై విరుద్ధ అభిప్రాయాలు

అల్యూమినియంను సహాయక పదార్థంగా వ్యాక్సీన్లలో చాలా కాలం ఉపయోగిస్తున్నారు.

రామన్ వంటిట్లో వాడే పదార్ధాలను కలిపి వ్యాక్సీన్లు ఇచ్చిన తర్వాత అతని గుర్రాలు స్పందించిన తీరు చూసిన బ్రిటిష్ ఇమ్యునాలజిస్ట్ అలెగ్జాండర్ గ్లెన్నీ ఇంకొక విషయాన్ని కనిపెట్టారు. 1926లో అతని బృందం డిఫ్తీరియా బ్యాక్టీరియా వల్ల పుట్టే విష పదార్ధాలు శరీరంలో నెమ్మదిగా కరుగుతాయని తెలుసుకున్నారు. దీని వల్ల శక్తిమంతమైన రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని వారు వివరించారు.

దీని కోసం గ్లెన్ని అల్యూమినియం సాల్టులను ఉపయోగించడం ప్రారంభించారు. ఆయన కొత్తగా తయారు చేసిన డిఫ్తీరియా విష పదార్ధాన్ని గినియా పందులపై వ్యాక్సీన్‌గా ప్రయోగించి చూసినప్పుడు అనుకోని ఫలితం వచ్చింది. ఈ విష పదార్థంతో పాటు అల్యూమినియం సాల్టులను ఎక్కించినవి శక్తివంతమైన రోగ నిరోధక శక్తిని ప్రదర్శించాయి. దీంతో అల్యూమినియంతో వ్యాక్సీన్ శక్తిమంతం అవుతుందనే విషయం అర్థమైంది.

ఈ అల్యూమినియం సాల్టులు వ్యాక్సీన్‌లో ఉండే ముఖ్య పదార్థానికి అతుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని నెమ్మదిగా క్రియాశీలం చేసి దీర్ఘ కాలం పాటు ఉండేందుకు సహాయ పడతాయి,

ఈ రోజుకీ వ్యాక్సీన్లలో ఉండే అల్యూమినియం ఉప్పు రూపంలోనే ఉంటుంది. ఇందులో అల్యూమినియం హైడ్రాక్సైడ్ (గుండె మంట, అజీర్ణం నుంచి రక్షణ), అల్యూమినియం ఫాస్ఫేట్ (దంతాల సంరక్షణకు సిమెంటుగా వాడతారు), పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ (బేకింగ్ పౌడర్ లో ఉంటుంది) ఉంటాయి.

అయితే, ఇప్పుడు ఈ ఆలోచన పాతబడిపోయింది. వాస్తవానికి పరిస్థితులు కాస్త సంక్లిష్టంగానే ఉంటాయని తేలింది.

వ్యాక్సీన్

అల్యూమినియం సాల్టులలో ఉండే విష పదార్థాలే అవి పని చేయడానికి కారణం. బలహీనపడిన కణాలు యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడానికి అవి సహకరిస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రోగ నిరోధక కణాలు అవసరమైన ప్రాంతానికి చేరి యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం మొదలుపెడతాయి. దీంతో వ్యాక్సీన్ పని చేయడం మొదలు పెడుతుంది.

అలాగే నాల్ప్-3 అనే గ్రాహకం కూడా సహాయక పదార్థంగా ప్రధాన పాత్ర పోషిస్తుందనే వాదన ఉంది. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీకి చెందిన రిచర్డ్ ఫ్లావెల్ 2008లో చేసిన ఒక అధ్యయనంలో ఈ పదార్ధం లేకుండా ఒక ఎలుకకు అల్యూమినియంతో కూడిన వ్యాక్సీన్ ఇచ్చారు. అయితే, అవి ఎటువంటి రోగ నిరోధక శక్తిని ప్రదర్శించలేదు. అప్పుడు మరో నూనె సంబంధిత సహాయక పదార్థంతో కూడిన వ్యాక్సీన్ ఎక్కించి చూసినప్పుడు అవి యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాయి.

అంటే, వ్యాక్సీన్లు అల్యూమినియం నాల్ప్-3 గ్రాహకం వల్ల పని చేస్తున్నాయని అర్ధమైంది. ఒకసారి రోగ నిరోధక శక్తి వచ్చిన తరువాత వీటి వల్ల వ్యాక్సీన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

నిజానికి చాలా రకాల సహాయకాలు ఉన్నప్పటికీ వ్యాక్సీన్లు ప్రభావవంతంగా పని చేయడానికి ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు.

ఎంఎఫ్-59లో ఉండే ముఖ్యమైన పదార్థమైన, సొర చేప కాలేయం నుంచి తీసిన స్క్వాలీన్‌ను సాధారణ జలుబుకి ఇచ్చే వ్యాక్సీన్లలో ఇప్పటికే వాడుతున్నారు. దీన్నే కోవిడ్-19 వ్యాక్సీన్‌కు కూడా పని చేస్తుందో లేదో చూస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాక్సీన్‌ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచ జనాభా అంతటికీ ఇవ్వాలంటే సుమారు 2,50,000 సొర చేపలను చంపాల్సి ఉంటుంది. దీని వల్ల వాటి జాతి మొత్తం అంతమైపోవచ్చు అనే వాదన కూడా తలెత్తింది. అయితే, ఈ లెక్కల పై ఇంకా వాదనలు జరుగుతూనే ఉన్నాయి.

1920లల్లో, 50ల్లో వాడిన సహాయక పదార్థాల కంటే మెరుగైన పదార్థమేదైనా దొరుకుతుందా అని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

వ్యాక్సీన్

భావి తరాలు

వ్యాక్సీన్ రంగంలో శాస్త్రవేత్తలు సంప్రదాయ విధానాల్లో పరిశోధనలు చేస్తుంటారు అని సన్ అంటారు. "ఏ వ్యాక్సీన్ కైనా సహాయక పదార్థాన్ని కనిపెట్టాలని అనుకున్నప్పుడు సంప్రదాయంగా వాడుతున్నవి, సురక్షితం, ప్రభావితమైనవని ముందే తెలిసినవాటిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు’’అని ఆయన వివరించారు.

ఇన్ఫెక్షన్లకు గురవ్వడానికి అవకాశం ఉన్న చాలా మంది వ్యాక్సీన్లకు వేగంగా స్పందించరు. ఉదాహరణకు ఒక రకమైన ఫ్లూ కోసం చేసిన వ్యాక్సీన్.. 65 ఏళ్లు పైబడిన వారికి 58 శాతం ప్రభావవంతంగా పని చేస్తే , తక్కువ వయస్సు వారికి 77. 6 శాతం ప్రభావవంతంగా పని చేస్తుంది.

కోవిడ్-19 వ్యాక్సిన్ల విషయంలో ఇదే పరిస్థితి తలెత్తవచ్చనే భయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్‌లో పుట్టే సహాయక పదార్థాలతో మరింత ప్రభావవంతంగా పని చేసే వ్యాక్సీన్లను ఉత్పత్తి చేయవచ్చు.

బ్యాక్టీరియా వలన వచ్చే సహజమైన ఇన్ఫెక్షన్లలో రోగ నిరోధక కణాల ఉపరితలం మీద ఉండే గ్రాహకాలకు ప్రోటీన్ అతుక్కుని ఉంటుంది.

ఇది ప్రమాదాన్ని హెచ్చరించడానికి సంకేతంగా పని చేసిస్తుంది. శరీరంలో ఉండే ఇతర రోగ నిరోధక కణాలకు సంకేతాన్ని పంపించి రక్షణ కవచంగా పని చేసేందుకు సహకరిస్తుంది. ఈ బ్యాక్టీరియాని వ్యాక్సీన్లలో ఎక్కించినప్పుడు కూడా ఇదే రీతిలో పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Many ingredients used in the preparation of vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X