వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యకిరణాలు..యూవీ హీట్..బ్లీచింగ్: కరోనా గురించి కొత్త విషయాన్ని వెల్లడించిన ట్రంప్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కరోనా వైరస్ బారిన పడి అల్లాడిపోతోంది అగ్రరాజ్యం అమెరికా. అమెరికాలో కరోనా వైరస్ పెను ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే అక్కడ 49 వేల మందికి పైగా మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిది లక్షలకు చేరువగా ఉంటోంది. కరోనా వైరస్ తీవ్రతను నియంత్రించడానికి అమెరికా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పెద్ద ఎత్తున పరిశోధనలను కొనసాగిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్యంలో కొనసాగుతోన్న ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు.

రంజాన్ ఆరంభం వేళ.. శ్రీకాళహస్తిలో కంప్లీట్ లాక్‌డౌన్: తొలి టౌన్‌గా: వైసీపీ ఎమ్మెల్యే పనేనంటూరంజాన్ ఆరంభం వేళ.. శ్రీకాళహస్తిలో కంప్లీట్ లాక్‌డౌన్: తొలి టౌన్‌గా: వైసీపీ ఎమ్మెల్యే పనేనంటూ

 ఎండ వేడి, అల్ట్రా వయోలెట్ కిరణాలు, వాతావరణంలో తేమ..

ఎండ వేడి, అల్ట్రా వయోలెట్ కిరణాలు, వాతావరణంలో తేమ..

ఎండ తీవ్రంగా ఉన్న వాతావరణంలో వైరస్ కదలికలను నెమ్మదిగా ఉంటాయని ట్రంప్ వెల్లడించారు. ఆ తరహా వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందబోదని అన్నారు. ఎండ తీవ్రత, అల్ట్రా వయోలెట్ కిరణాలు, ఐసొప్రొఫిల్ అల్కహాల్‌తో దాన్ని కట్టడి చేయవచ్చనడానికి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. గురువారం ఆయన తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోమ్‌ల్యాండ్ చీఫ్ బిల్ బ్రియాన్‌తో కలిసి ఆయన మాట్లాడారు. మాట్లాడారు. కరోనా వైరస్ నియంత్రణకు శాస్త్రవేత్తలు కొనసాగించిన పరిశోధనలకు సంబంధించిన పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

గాలిలో తేమ ఎక్కువగా ఉంటే..

గాలిలో తేమ ఎక్కువగా ఉంటే..

గాలిలో తేమశాతం కూడా కరోనా వైరస్ కదలికలపై ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. గాలిలో తేమశాతం అధికంగా ఉంటే వైరస్ కదలికలు చురుగ్గా ఉంటాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయం తేలిందని అన్నారు. తేమ శాతం తక్కువగా ఉండే ప్రదేశాలపై దాని ప్రభావం పెద్దగా ఉండబోదని ట్రంప్ చెప్పారు. ఇన్‌డోర్, వేడి వాతావరణంలో కరోనా వైరస్ ఎక్కువ సేపు ఉండబోదని, సూర్యకిరణాలు నేరుగా ఆ వైరస్ మీద ప్రసారమైనా అది ఎక్కువ సేపు జీవించలేదని వెల్లడించారు.

 వైరస్ సెలైవా కట్టడికి..

వైరస్ సెలైవా కట్టడికి..

ఈ కోణంలో మరిన్ని పరిశోధనలను చేయాల్సి ఉందని, మేరీల్యాండ్ ల్యాబోరేటరీ నివేదికలను పరిశీలించాల్సి ఉందని ట్రంప్ చెప్పారు. ఎండ తీవత్ర అధికంగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ మటుమాయం అవుతోందనే విషయం తమ పరిశోధనల్లో తేలిందని బిల్ బ్రియాన్ తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణంగా చెప్పుకొనే సెలైవా ప్రభావం ఎండ తీవత్ర అధికగా ఉండే ప్రాంతాల్లో కనిష్టంగా చూపినట్లు తాము గుర్తించామని అన్నారు. సెలైవాను విస్తరణను అడ్డుకోవడానికి బ్లీచింగ్ పౌడర్ ఉపయోగపడుతుందని బ్రియాన్ స్పష్టం చేశారు. అమెరికాలో త్వరలోనే వేసవి కాలం ఆరంభం కాబోతోందని, ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఈ వాతావరణం ఉపయోగపడుతుందని అన్నారు.

Recommended Video

Donald Trump Surprising Words on North Korean Leader Kim Jong Un

English summary
A top scientist from the Department of Homeland Security said Thursday that preliminary research shows that the coronavirus dies out more quickly in hot, humid weather than in colder, drier conditions. “Increasing the temperature and humidity … is generally less favorable to the virus,” said William Bryan, head of science and technology at DHS, said during the daily Coronavirus Task Force daily briefing at the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X