వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కష్టకాలంలో అలా కౌగలించుకుంటున్న ఈ దంపతుల ఫోటో వైరల్..!

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళిస్తున్న వేళ వైద్య సిబ్బంది మాత్రం అందరికీ భగవంతుడిలా కనిపిస్తోంది. వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ మహమ్మారిపై పోరాడుతున్నారు. అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నారు. కరోనావైరస్ పై పోరులో భాగంగా కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ తమ సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది. తాజాగా ఫ్లోరిడాలో నివాసముంటున్న నర్స్ దంపతుల ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. వారికథ తెలుసుకుంటే సెల్యూట్ చేయాల్సిందే.

 ఉద్వేగంకు లోనైన దంపతులు

ఉద్వేగంకు లోనైన దంపతులు

అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఓ పెళ్లయిన జంట కరోనావైరస్‌ పోరాటంలో భాగస్వాములయ్యారు. బెన్‌ కేయర్, మరియు మైండీ బ్రాక్ అనే ఈ కపుల్ వృత్తి పరంగా నర్సులు. ఇద్దరూ ఒకే హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. కానీ ఒకరికొకరు దూరంగా ఉంటూ కొన్ని రోజులుగా ఒకరినొకరిని చూసుకోలేదు. అయితే కరోనావైరస్ వార్డుల్లో బిజీగా ఉన్న ఈ జంట చివరకు ఒకరినొకరు కలుసుకున్నారు. ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. బెన్ కేయర్ మరియు మైండీ బ్రాక్ ఒకరినొకరు కలుసుకోగానే ఆనందబాష్పాలు వారి కళ్ల నుంచి జారువాలాయి. వారు సంరక్షణ దుస్తులను ధరించి ఒకరినొకరు కౌగలించుకుంటున్న సందర్భంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి ఫోటోలు తీశారు.

 సోషల్ మీడియాలో ఫోటో వైరల్

సోషల్ మీడియాలో ఫోటో వైరల్

ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయగానే ఎంతో మంది నెటిజెన్లను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ విపత్కర సమయాల్లో ఈ దంపతులు చేస్తున్న సేవలను కొనియాడింది. ఎన్నో కలలు కని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఈ నవ దంపతులు ఇలా కరోనావైరస్ మహమ్మారి పై పోరాడుతుండటం నిజంగా అభినందనీయమని నెటిజెన్లు కామెంట్ల ద్వారా తెలిపారు. ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ కావడంతో ఈ ఫోటో గురించి చాలామంది చర్చించుకుంటున్నారని కేయర్ చెప్పారు. ఈ సమయంలో ఈ ఫోటో అందరి హృదయాలను తాకిందంటే అందుకు కారణం ప్రతి ఒక్కరం ఈ కష్ట సమయాల్లో విషమ పరీక్షను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ ఫోటో ప్రేమ ఆశను ప్రతిబింబిస్తోందని చెప్పారు.

Recommended Video

India Lockdown 2.0 : KCR To Take A Key Decision On April 20th Over Coronavirus Lockdown
 ఇంట్లోవారికి కరోనా.. అయినా సేవకే అంకితం

ఇంట్లోవారికి కరోనా.. అయినా సేవకే అంకితం

ఇక వీరి లవ్ స్టోరీ 2007లో ప్రారంభమైంది. ఇద్దరూ అనెస్తీషియా స్కూల్‌లో కలిశారు. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ బలపడింది. ఐదేళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఒకే మాటపై నిలబడుతారు. అందుకే ప్రాణాలకు సైతం తెగించి ఒకే హాస్పిటల్‌లో కరోనావైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. పేషెంట్ల నోట్లో పైపులు పెట్టడం కూడా చేస్తున్నారు. అయితే వారి నుంచి చిన్న బిందువు వీరిపై పడ్డా అది ఎంత ప్రమాదంకు దారి తీస్తుందో తెలిసి కూడా వారు చికిత్స అందించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే వారింట్లో బ్రాక్ తల్లికి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆమె కోలుకున్నారు. ఇక ఆమె సోదరికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. బ్రాక్ దంపతులతో కలిసి పనిచేస్తున్న వారిలో కూడా ఒక ఆందోళన మొదలైంది.

మొత్తానికి అన్ని కష్ట సమాయాల్లో కూడా ఈ దంపతులు కరోనావైరస్ మహమ్మారిపై పోరు చేస్తుండటం అభినందనీయం అని ఫోటో చూసిన చాలామంది అభిప్రాయపడుతున్నారు.

English summary
Married nurses who are on the frontlines amid the coronavirus pandemic have captured the hearts of thousands after a heartwarming photo of them embracing in their protective equipment went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X