వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UNICEF షాకింగ్ రిపోర్ట్ : ఆద మరిస్తే ఈ వ్యాధి ప్రభావంతో 8 లక్షల మంది పిల్లలు మరణించే ఛాన్స్..!

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కోవిడ్-19 వణికిస్తోంది. కరోనావైరస్ కారణంగా ఆయా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించగా ఆర్థికంగా నష్టపోతున్న వేళ తిరిగి క్రమంగా లాక్‌డౌన్‌ను కొన్ని దేశాలు ఎత్తివేశాయి. భారత్‌తో సహా మరికొన్ని దేశాలు ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మరణాలు పెరిగిపోతుండగా అంతే స్థాయిలో పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్(Unicef) ఓ షాకింగ్ రిపోర్టును విడుదల చేసింది. ఈ మహమ్మారి పిల్లలపై పంజా విసురుతోందంటూ ఓ నివేదిక వెల్లడించింది. ఇంతకీ పిల్లలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది..?

 తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 9వేల మార్క్ దాటింది, 3 మరణాలు తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 9వేల మార్క్ దాటింది, 3 మరణాలు

 యూనిసెఫ్ రిపోర్టులో ఏముంది..?

యూనిసెఫ్ రిపోర్టులో ఏముంది..?

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ "Upended Lives "(అప్‌ఎండెడ్ లైవ్స్) పేరుతో తాజాగా ఒక రిపోర్టును విడుదల చేసింది. కోవిడ్-19 సేవలకు ఆటంకం కలిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇది ముఖ్యంగా పిల్లలపై తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని పేర్కొంది. మాతృ సంబంధిత సేవలు, అప్పుడే పుట్టిన బిడ్డకు సంబంధించిన సేవలు, బిడ్డ ఆరోగ్య విషయానికి సంబంధించిన సేవలకు ఆటంకం కలిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ పరిస్థితి ఎక్కువగా దక్షిణాసియాలో తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఇందులో భారత్ కూడా ఉంది.

 ఆ సేవలు మరిస్తే పిల్లలు ప్రాణాలకే ప్రమాదం

ఆ సేవలు మరిస్తే పిల్లలు ప్రాణాలకే ప్రమాదం

కోవిడ్-19 పై దృష్టి ఎక్కువ పెడుతుండటంతో ఇతర రోజూ వారీ జరిగే చికిత్సలు లేదా సేవలు మరుగున పడిపోతున్నాయని యూనిసెఫ్ పేర్కొంది. ఇదే ప్రమాదకరంగా మారే అవకాశాలున్నట్లు వెల్లడించింది. దీనిపై మే నెలలో జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. కోవిడ్-19 పై ఎక్కువగా దృష్టి సారించడంవల్ల దక్షిణాసియా దేశాల్లో అదనంగా రోజుకు 2400 మంది చిన్నారులు మృత్యువాత పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ మహమ్మారి గత దశాబ్దకాలంగా ఎన్నడూ లేనంతగా పలు రంగాలను కుదిపేస్తోంది. పిల్లల ఆరోగ్యం, వారి చదువులపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దక్షిణాసియా దేశాల ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవడం ద్వారా ఆయా కుటుంబాలు తిరిగి పేదరికంలో నెట్టబడకుండా ఉంటాయని జాగ్రత్తలు జారీ చేసింది యూనిసెఫ్.

 8.81 లక్షల మంది చిన్నారులకు ప్రమాదం

8.81 లక్షల మంది చిన్నారులకు ప్రమాదం

ఇక అత్యంత దారుణమైన పరిస్థితే తలెత్తితే దక్షిణాసియా దేశాల్లో ఐదేళ్లలోపు ఉన్న 8.81 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది యూనిసెఫ్. మరోవైపు 36వేల మంది తల్లులు కూడా మృతి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మరణాలు ఎక్కువగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌లలో సంభవిస్తాయని హెచ్చరించింది. పిల్లల ప్రాణాలకు కోవిడ్-19 నుంచి ప్రత్యక్ష ముప్పు తక్కువగానే ఉన్నప్పటికీ... రొటీన్ సేవలకు ఆటంకం కలిగితే మాత్రం ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతోంది. బిడ్డ పుట్టుక, బిడ్డ ఆరోగ్యం, మంచి పోషకాహారంలాంటి సేవలు కోవిడ్ సమయంలో నిలిచిపోకుండా చూడాలని యూనిసెఫ్ హెల్త్ అడ్వైజర్ పాల్ రట్టర్ చెప్పారు. ఇక కోవిడ్-19 కారణంగా లాక్‌ డౌన్ ఆయా దేశాలు విధించడంతో పిల్లలకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయని వెల్లడించారు. అయితే ఆర్థిక సంక్షోభం ప్రభావం పిల్లలపై మరోలా ఉంటుందని హెచ్చరించారు.

 హెచ్చరిస్తోన్న యూనిసెఫ్

హెచ్చరిస్తోన్న యూనిసెఫ్

ఇప్పుడు ఈ ఇబ్బందిని గుర్తించి సరైన చర్యలు తీసుకోకపోతే కోవిడ్-19తో ఒక తరం ఆలోచనలను ఆకాంక్షలను భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుందని యూనిసెఫ్ హెచ్చరిస్తోంది. లాక్‌డౌన్ విధించడం, కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం వంటివి దీర్ఘకాలంలో పిల్లలపై ప్రభావం చూపుతుందని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామీణ భారతంలో ఇది స్పష్టంగా బయలుపడినట్లు చెప్పిన యూనిసెఫ్... లాక్‌డౌన్‌తో చాలామంది వలస కూలీలు పలు ఇబ్బందులు పడటమే ఇందుకు నిదర్శనం అని వివరించింది. చిన్న పిల్లలు సుదీర్ఘంగా ప్రయాణం చేశారని గుర్తుచేసింది. అంతే కాదు వీరంతా

English summary
Covid impact may kill 8lakhs kids in South Asia if proper care is not taken by the govts warns Unicef.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X