• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా ఆగమాగం: మళ్లీ రికార్డు మరణాలు-మాస్క్ వద్దంటూ ట్రంప్ కిరికిరి-అన్ని దేశాలకు వ్యాక్సిన్ సప్లై

|

రెండో దశ కరోనా విలయం అగ్రరాజ్యం అమెరికాను ఆగం పట్టిస్తున్నది. రెండున్నర నెలల తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1592 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 60వేల మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45లక్షలకు, మొత్తం మరణాల సంఖ్య 1.52లక్షలకు పెరిగింది.

రికవరిలు, యాక్టివ్ కేసులు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇంత భయానక పరిస్థితుల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనాలోచిత చర్యలకు పాల్పడటం విమర్శలకు దారితీసింది. ఆయన మాత్రం ఎప్పటిలాగే తానే రైటనే వాదనకు దిగారు.

అయోధ్య భూమి పూజపై అసదుద్దీన్ ఫైర్ - ప్రధాని మోదీ హాజరు రాజ్యాంగ విరుద్ధం - అదెప్పటికీ మసీదే..

ఆ నాలుగు రాష్ట్రాల్లో తీవ్రం..

ఆ నాలుగు రాష్ట్రాల్లో తీవ్రం..

ఏప్రిల్ నెలంతా ప్రతి రోజూ కనీసం 2వేలకు తగ్గకుండా అమెరికాలో కేసులు నమోదయ్యాయి. మే మొదటి వారం నుంచి మరణాలు, కేసుల తీవ్రత తగ్గింనట్లే తగ్గి, మళ్లీ ఈనెల రెండో వారంలో తిరగబెట్టింది. మంగళవారం నమోదైన 1592 కేసులు.. గడిచిన రెండున్నర నెలల్లో అత్యధిక సంఖ్య. ప్రధానంగా అర్కాన్సస్, ఫ్లోరిడా, మొంటానా, ఆరెగాన్ రాష్ట్రాల్లో మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది. కాలిఫోర్నియా, టెక్సాస్ లోనూ పరిస్థితి ఆందోళనకరంగా కనసాగుతున్నది. ఇదిలా ఉంటే,

మాస్కులు వద్దంటూ..

మాస్కులు వద్దంటూ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ముఖ్య సంస్థల ఆమోదం లేనప్పటికీ, కొవిడ్-19 చికిత్స కోసం ట్రంప్.. మలేరియా డ్రగ్ ‘హైడ్రోక్లోరోక్విన్'ను ప్రోత్సహిస్తుండటం తెలిసిందే. దాని వల్ల మరణాల రేటు పెరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ట్రంప్ అనుకూల డాక్టర్ల బృందం ఓ వీడియోను రూపొందించింది. హైడ్రోక్లోరోక్విన్ చాలా సేఫ్ అని, కరోనాకు మాస్కుల వాడకం తప్పనిసరేమీ కాదని ఆ వీడియోలో పేర్కొన్నారు. దాన్ని ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన కొడుకు జూనియర్ ట్రంప్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.

ట్రంప్ ఫ్యామిలీకి షాక్..

ట్రంప్ ఫ్యామిలీకి షాక్..

మాస్కులు అత్యవసరం కాదు, హెచ్ క్యూసీ సేఫ్ అంటూ ట్రంప్ ఫ్యామిలీ షేర్ చేసిన వీడియోల్ని ఫేస్ బుక్, ట్విటర్ తొలగించాయి. కరోనా మహమ్మారికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన కారణంగా అమెరికా అధ్యక్షుడు పోస్టును డిలిట్ చేశామని ఆ సంస్థలు ప్రకటించాయి. ట్రంప్ మొదట ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. 1.4 కోట్ల మంది దాన్ని చూశారు. దాన్ని ఫేస్ బుక్ డిటిట్ చేశాక అదే క్లిప్పింగ్ ను ట్విటర్ లో పెట్టారు. ప్రెసిడెంట్ పోస్ట్‌లు కొవిడ్-19 నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, జూనియర్ ట్రంప్ ట్విటర్ అకౌంట్ ను 12 గంటలపాటు నిలిపేస్తున్నామని ట్విటర్ సంస్థ ప్రతినిధి తెలిపారు.

చైనా షాకింగ్: అక్సాయ్ చిన్ లో అలజడి - లదాక్ నుంచి పూర్తిగా వెనక్కి - టీ90 యుద్ధ ట్యాంకులతో భారత్

తనకు తానే సాటి.. ట్రంప్‌కు లేదు పోటీ..

తనకు తానే సాటి.. ట్రంప్‌కు లేదు పోటీ..

అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా కట్టడి కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో కీలక సభ్యుడైన ఆంథోనీ ఫౌచీకి వైరాలజీ నిపుణుడిగానూ గొప్ప పేరుంది. ఇటీవలి కాలంలో ఆయన చేపట్టిన చర్యల కారణంగా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఇంకా పెరిగింది. దీంతో ట్రంప్ ఒకింత అక్కసు నిండిన గొంతుతో.. ‘‘నా ప్రభుత్వం నియమించిన అధికారి పని తీరుకు ప్రశంసలు వస్తున్నాయి. కానీ నన్ను మాత్రం అందరూ విమర్శిస్తున్నారు. బహుశా నా వ్యక్తిత్వమే ఇందుకు కారణం కావొచ్చు. ఏదేమైనా కరోనా నియంత్రణ చర్యల్లో నా కంటే బాగా పనిచేసినవాళ్లెవరూ లేరు''అని ట్రంప్ చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలను మరోలా అర్థం చేసుకున్న నెజిజన్లు.. ‘‘అవును, ఇప్పటికైనా ట్రంప్ లాగా ఎవరూ ఉండరని ఆయనే ఒప్పుకున్నారు''అంటూ ఎద్దేవా చేశారు. కొవిడ్ కేసులు, మరణాల్లో అమెరికానే టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

  US Vs China : తీవ్ర ఉత్కంఠ.. చైనాకు అతి సమీపంగా అమెరికా యుద్ధవిమనాలు! || Oneindia Telugu
  అందరికీ అమెరికా నుంచే వ్యాక్సిన్..

  అందరికీ అమెరికా నుంచే వ్యాక్సిన్..

  మాస్కులపై వ్యతిరేకత, హెచ్‌క్యూసీపై ఇష్టతను పక్కన పెడితే, కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించి ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో మోడెర్నా సంస్థ పురోగతి సాధించిందని, మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభం అయ్యాయని, 30 వేల మంది వాలంటీర్లపై జరుగుతోన్న ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే, 2021 ప్రారంభంలోపే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రెసిడెంట్ పేర్కొన్నారు. ‘‘ఇప్పటికే అత్యవసర వైద్య పరికరాలను అందరికీ సరఫరా చేస్తున్నాం. ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రపంచ దేశాలన్నింటికీ అమెరికా నుంచి సప్లై చేస్తాం'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

  English summary
  US Covid-19 Toll Highest in 2.5 Months with 1,592 New Deaths in 24 Hours. USA To Possibly Supply COVID-19 Vaccine To Other Countries, Says Trump. twitter removes trump and trump junior tweet for sharing misinformation
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X