వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read:సిగరెట్ కంపెనీ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్.. దీని తయారీ చాలా ఇంట్రెస్టింగ్ గురూ..!

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ చాలా మంది ఈ మహమ్మారికి విరుగుడు కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ అమెరికా ఫార్మా కంపెనీ గిలియాడ్ సంస్థ రెమిడెసివిర్‌ను కనుగొంది. ఇది ఎమెర్జెన్సీ పద్ధతిలో మాత్రమే వినియోగించాలని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇక చైనాతో పాటు ఇతర దేశాలు కూడా వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆదిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. తాజాగా ప్రపంచలోనే రెండో అతిపెద్ద సిగరెట్ తయారీ కంపెనీ బ్రిటీష్ అమెరికన్ టొబాకో కూడా కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొని ప్రస్తుతం టెస్టింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

Recommended Video

COVID-19 Vaccine : Tobacco-Based Potential COVID-19 Vaccine Is Ready
 సిగరెట్ కంపెనీ నుంచి కరోనా విరుగుడు

సిగరెట్ కంపెనీ నుంచి కరోనా విరుగుడు

ప్రపంచంలో రెండో అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ బ్రిటీష్ అమెరికన్ టొబాకో కంపెనీ కరోనావైరస్‌ విరుగుడుకు వ్యాక్సిన్ కనుగొన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అది టెస్టింగ్ దశలో ఉందని వెల్లడించింది. అయితే దీని తయారీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ వ్యాక్సిన్‌ను పొగాకు ఆకుల నుంచి సేకరించిన ప్రొటీన్స్‌ను మనిషిపై ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. అంతకుముందు నిర్వహించిన ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లు తమ పరిశోధనల్లో తేలిందని సిగరెట్ తయారీ సంస్థ పేర్కొంది. ఇక ఒక్కసారి ఈ వ్యాక్సిన్‌కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం లభిస్తే తొలి దశ టెస్టింగ్ ట్రయల్స్ ప్రారంభిస్తామని వెల్లడించింది.

 ముందుగా విమర్శలు.. అయినప్పటికీ...

ముందుగా విమర్శలు.. అయినప్పటికీ...

పొగాకు ఆకుల నుంచి కోవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొంటామని ఏప్రిల్‌లో ప్రకటించిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది ఈ సంస్థ. ఆ సమయంలో వారానికి 1 మిలియన్ నుంచి 3 మిలియన్ డోసులను తయారు చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం తమకు అండగా నిలిస్తే ఇది సాధ్యమవుతుందని కూడా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కరోనావైరస్ మహమ్మారికి విరుగుడు కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔషధ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్‌లు మనుషులపై ప్రయోగించే దశకు చేరుకున్నాయి. అయితే కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

 జూన్‌లో క్లినికల్ ట్రయల్స్

జూన్‌లో క్లినికల్ ట్రయల్స్

ఇదిలా ఉంటే తాము కనుగొన్న కొత్త వ్యాక్సిన్‌కు సంబంధించిన అంశాలు ఎఫ్‌డీఏ అప్రూవల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు ఈ లండన్ సిగరెట్ తయారీ సంస్థ వివరించింది. ఆ దరఖాస్తు తమకు అందినట్లు ఎఫ్‌డీఏ తిరిగి సమాధానం ఇచ్చిందని పేర్కొంది. మరోవైపు ప్రపంచ దేశాల ప్రభుత్వాలతో కూడా ఈ వ్యాక్సిన్‌ పై చర్చలు జరుపుతున్నట్లు బ్రిటన్ అమెరికన్ టొబాకో సంస్థ వెల్లడించింది. ఇక జూన్ నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని యోచిస్తున్న నేపథ్యంలో నిధులను కూడా సేకరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధులను ఇతర పరికరాల కొనుగోలు చేసేందుకు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పింది. బ్రిటన్ అమెరికన్ టొబాకో సంస్థ ఈ ప్రకటన చేయగానే లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఈ సంస్థ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగడం విశేషం

English summary
London based cigarette company says it has developed a vaccine for covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X