COVID-19: చైనాను మళ్లీ చింపేస్తున్న వైరస్, చేసుకున్నోడికి చేసుకున్నంత, 20 వేల మంది క్వారంటైన్!
బీజింగ్/ న్యూఢిల్లీ: చేసుకున్నవాడికి చేసుకున్నంత అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. చైనా పరిస్థితి ఇప్పుడు అలాగే తయారైయ్యింది. కరోనా వైరస్ మహమ్మారి (COVID-19)ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన చైనాలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడే అవకాశం ఉండటంతో దాదాపు 20 వేల మందిని అక్కడి ప్రభుత్వం నిర్బంధించింది. కరోనా వైరస్ విషయంలో నిర్లక్షం చేసిన చైనా ఇప్పుడు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతోంది. ప్రాణాలతో ఉన్న పాములు, కప్పులు మింగేస్తున్న చైనీలు ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారని స్థానిక మీడియా వెళ్లడించింది.

12 గ్రామాల్లో 20 వేల మంది
చైనాలోని షిజియాజువాంగ్ సమీపంలోని గావోచెంగ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కరోనా వైరస్ తో పాటు అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. గావోచెంగ్ జిల్లాలోని 12 గ్రామాల్లోని 20, 000 మంది పౌరులు వారి ప్రాంతాల నుంచి బయటకు వెళ్లకుండా అధికారులు నిర్బంధించారు. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా స్థానిక ప్రజలను నిర్బంధించారని చైనా స్టేట్ మీడియా తెలిపింది.

ముందు జాగ్రత్త మిత్రమా
కరోనా వైరస్ ఉన్న వ్యక్తులు, వైరస్ లేని వ్యక్తుల మద్య సంబంధాలు కట్టడి చెయ్యడానికి, అంటు వ్యాధులు వ్యాపించకుండా చూడటానికి 12 గ్రామాల ప్రజలను సైట్లలోని క్వారంటైన్లలో నిర్బంధించారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (NHC) అధికారి టాంగ్ జావోహై చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా అంటువ్యాధులు వ్యాపించకుండా చూడటానికి ఇలా చేశారని చైనా మీడియా చెప్పుకోస్తోంది.

చైనా హెబీ ప్రావిన్స్
చైనాలోని షిబియాజువాంగ్ రాజధాని అయిన హెబీ ప్రావిన్స్ ప్రాంతం ఇప్పుడు వైరస్ కు కేంద్రబింధువుగా మారిందని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం 138 కోవిడ్ కేసులు నమోదు కాగా వాటిలో 14 కేసులు షిజియాజువాంగ్ ప్రాంతంలో నమోదు అయ్యాయని, అందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నామని హెబీవైస్ గవర్నర్ జు జియాన్ పీ స్పష్టం చేశారు.

17 లక్షల మందికి పరీక్షలు
హెబీ ప్రావిన్స్ ప్రాంతంలో మంగళవారానికి 17 లక్షల మందికి వైద్యపరీక్షలు మగిశాయని, ఆదివారం రెండో రౌండ్ పరీక్షలు మళ్లీ మొదలౌతాయని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారని చైనా మీడియా తెలిపింది. హెబీ ప్రావిన్స్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కరోనా వైరస్ దెబ్బతో ఓ వ్యక్తి చనిపోయాడని స్థానిక అధికారులు తెలిపారు. హెబీ ప్రావిన్స్ ప్రాంతంలో 33 హెక్టార్లలో 3, 000 తాత్కాలిక వార్డులు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలను బయటకు వెళ్లకుండా నిర్బంధించి వైరస్ ను కట్టడి చెయ్యడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్థానిక మీడియా ద్వారా వెలుగు చూసింది.