వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు షాకిచ్చిన నేపాల్: భారత్‌లో తయారయ్యే కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఆమోదం

|
Google Oneindia TeluguNews

చైనాకు సాగిలపడేలా ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యవహరించిన తీరును అధికార మావోయిస్టు పార్టీ ఖండించడం, పార్లమెంట్ రద్దు తదితర పరిణామాల తర్వాత నేపాల్ విధానాల్లో మార్పులొచ్చాయి. హిమాలయ దేశం తిరిగి పాత రూట్లోనే.. భారత్‌తో సఖ్యతగా మెలిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది..

బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తేబీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే

నేపాల్‌లో అత్యవసర వినియోగానికిగానూ కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. నేపాల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ(డీడీఏ) శుక్రవారం ఈ మేరకు అనుమతుల మంజూరుపై ప్రకటన చేసింది. బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు కలిసి అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ ను భారత్ లో భాగస్వామిగా ఉన్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తుండటం తెలిసిందే. సీరం సంస్థ.. భారత గడ్డపై ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లు దాదాపు 100 దేశాలకు ఎగుమతి కానున్నాయి. వాటిలో తొలిగా నేపాల్ నుంచే ఆర్డర్లు రావడం గమనార్హం. నిజానికి..

 covid-19: Nepal approves Covishield vaccine for emergency use

క‌రోనా వైరస్ కు విరుడుగుగా చైనా.. సినోవాక్ పేరుతో వ్యాక్సిన్‌ రూపొందించింది. ఆ వ్యాక్సిన్ ను నేపాల్ లోనూ సరఫరా చేస్తామని, అందుకు అనుమతివ్వాల్సిందిగా చైనా కోరింది. కానీ నేపాల్ ప్రభుత్వం చైనాకు షాకిస్తూ.. సీరం తయారీ 'కొవిషీల్డ్'వైపు మొగ్గుచూపింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు కూడా నేపాల్ అనుమతిచ్చే అవకాశాలున్నాయి. కాగా

 covid-19: Nepal approves Covishield vaccine for emergency use

నేపాల్ లో 20 శాతం జనాభాకు సరిపడా వ్యాక్సిన్లను భారత్ నుంచే కొనుగోలు చేస్తామంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గత వారమే మన మోదీ సర్కారుకు లేఖ రాశారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను కొనుగోలు చేయాలనే యోచనలో ఉన్నట్లు మంత్రి లేఖలో పేర్కొన్నారు. దీనిపై భారత్ సానుకూలత వ్యక్తం చేయాలనుకుంటుండగానే.. నేపాల్ ఇవాళ కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతిచ్చింది. ఇక..

 covid-19: Nepal approves Covishield vaccine for emergency use

నేపాల్ లో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 270 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,66,816కు పెరిగింది. ఇందులో 2, 60,567మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకోగా, మొత్తం 1,948మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 4,301గా ఉంది.

మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తిమోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తి

English summary
Nepal has granted emergency approval for AstraZeneca's India-made Covishield vaccine against the novel coronavirus that has claimed nearly nearly 1,950 lives in the country. The decision to grant the approval for the vaccine was taken on Friday, Nepal's Department of Drug Administration (DDA) said in a statement. 'Conditional permission has been granted for emergency use authorisation of Covishield vaccine against COVID-19 in Nepal,' the statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X