వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొవిడ్ వ్యాక్సిన్: రష్యా సంచలనం -స్పుత్నిక్-వి మాస్ వ్యాక్సినేషన్‌కు పుతిన్ ఆదేశం -భారత్‌లో ఎప్పుడంటే

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విలయానికి అడ్డుకట్ట వేసేలా అగ్రరాజ్యాలన్నీ కొవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధిని వేగవంతం చేయగా.. ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేయించిన రష్యా మరో అడుగు ముందుకేసి సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా ఆరోగ్య శాఖ, గమలేరియా ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా తయారుచేసిన 'స్ఫుత్నిక్-వి' వ్యాక్సిన్ ను సాహూహికంగా వినియోగించాలని ఆ దేశం డిసైడైంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను సామూహికంగా వాడటానికి బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చిన కొద్దిసేపటికే రష్యా మరో గుడ్ న్యూస్ తో ముందుకు రావడం గమనార్హం.

Recommended Video

COVID-19 Vaccine : వచ్చేవారం నుంచే Sputnik V Mass Vaccination ప్రక్రియ!

అసెంబ్లీలో చంద్రబాబు పాట -పడి పడి నవ్విన జగన్‌ -ఘోరమన్న స్పీకర్ -కీలక బిల్లులు పాస్అసెంబ్లీలో చంద్రబాబు పాట -పడి పడి నవ్విన జగన్‌ -ఘోరమన్న స్పీకర్ -కీలక బిల్లులు పాస్

 పుతిన్ కీలక ఆదేశాలు..

పుతిన్ కీలక ఆదేశాలు..

ఇప్పటికే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో 92 శాతం సమర్థతను నిరూపించుకున్న ‘స్పుత్నిక్-వి' వ్యాక్సిన్ ను సాధారణ జనసమూహాలకు అందించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించారు. వచ్చేవారం నుంచే స్పుత్నిక్-వి మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మాస్కోలోని అధికారిక కేంద్రం క్రెమ్లిన్ లో వ్యాక్సిన్ ఉత్పత్తులపై బుధవారం రివ్యూ సమావేశంలో మాట్లాడుతూ పుతిన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారని రష్యా డిప్యూటీ పీఎం తత్యానా గొలికోవా మీడియాకు తెలిపారు.

ఇక రిపోర్టులొద్దు.. టీకాలు వేసేయండి..

ఇక రిపోర్టులొద్దు.. టీకాలు వేసేయండి..

‘‘ప్రపంచంలోనే రిజిస్టరైన తొలి కొవిడ్ వ్యాక్సిన్ మనదే. స్పుత్నిక్-వి తయారీ, పనితీరు, సమర్థత, సేఫ్టీ, పంపిణీ తదితర అంశాలపై ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలనలు, చర్చలు చేశాం. ఇప్పుడు నేను చెప్పబోయే మాటను మీరంతా అంగీకరిస్తారనే అనుకుంటున్నాను. ఇక వచ్చే వారం నాకు మీరు రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు. నేరుగా జనసమూహాల్లోకి వెళ్లండి.. వచ్చే వారం నుంచే మాస్ వ్యాక్సినేషన్ మొదలు పెట్టండి.. '' అని వ్యాక్సిన్ పై రివ్యూ మీటింగ్ లో ప్రెసిడెంట్ పుతిన్ వ్యాఖ్యానించినట్లు డిప్యూటీ పీఎం తత్యానా తెలిపారు. ఇప్పటికే సైన్యం ఆధ్వర్యంలో స్పుత్నిక్-వి పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు ఆమె చెప్పారు. ఇలా ఉంటే..

డిసెంబర్ 4న ప్రధాని మోదీ ప్రకటన?

డిసెంబర్ 4న ప్రధాని మోదీ ప్రకటన?

రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ను భారత్ లోనూ ఉత్పత్తి చేసేలా.. మన ఫార్మా దిగ్గజాలైన హెటిరో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థతో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) గత వారమే ఒప్పందాలు చేసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి భారత్ లో స్పుత్నిక్-వి ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన ‘వ్యాక్సిన్ టూర్' అనంతర పరిణామాలతో కాస్త ముందుగానే ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రాబోతున్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సిన్ల నిల్వలు, పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సోమవారం ఆదేశాలిచ్చారు. శుక్రవారం(డిసెంబర్ 4న) ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరుగనున్న ఆల్ పార్టీ మీటింగ్ లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే..

ఆ రెండు వ్యాక్సిన్లే భారత్ కు కీలకం

ఆ రెండు వ్యాక్సిన్లే భారత్ కు కీలకం

ఇండియాకు సంబంధించినంత వరకు రెండు వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తున్నది. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల సమర్థత 95 శాతంగా ఉన్నప్పటికీ, వీటిని మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉండటం, అలాంటి కోల్డ్ చైన్ భారత్ సహా చాలా దేశాల్లో అందుబాటులో లేకపోవడం, ధరలు కూడా ఒక్కో డోసుకు రూ.3వేల వరకు ఉండటం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. దీంతో మోదీ సర్కార్ ప్రధానంగా సీరం అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, రష్యా తయారీ స్పుత్నిక్-వీ పైనే ఫోకస్ పెంచింది. ఎందుకంటే AZD1222 ఫార్ములాతో తయారైన ఈ రెండు వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలోనే స్టోర్ చేసుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేయడం కూడా సులవవుతుంది. పైగా కొవిషీల్డ్, స్పుత్నిక్-వి ఒక్కో టీకా డోసు ధర రూ.1000 లోపే ఉండనుంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ప్రారంభం నుంచే భారత్ లోనూ మాస్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

శెభాష్ సంజయ్.. ఇదే జోరు ఎక్కడా తగ్గొద్దు: తెలంగాణ బీజేపీ చీఫ్‌కు ప్రధాని మోదీ ఫోన్ -రిగ్గింగ్శెభాష్ సంజయ్.. ఇదే జోరు ఎక్కడా తగ్గొద్దు: తెలంగాణ బీజేపీ చీఫ్‌కు ప్రధాని మోదీ ఫోన్ -రిగ్గింగ్

English summary
Russian President Vladimir Putin on Wednesday ordered authorities to begin mass vaccinations against the novel coronavirus from next week in the country. "Let's agree on this - you will not report to me next week, but you will start mass vaccination ... let's get to work already," Putin reportedly told Deputy Prime Minister Tatiana Golikova.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X