వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవాలి : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . శీతాకాలం ప్రారంభమైన సందర్భంగా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతాయని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక కరోనా కేసులు కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు యుద్ధప్రాతిపదికన క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. డిసెంబర్ నెలలోగా కరోనా వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది అంటూ ఆశావహ దృక్పథంతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వచ్చే అవకాశం చాలా తక్కువంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్.

Recommended Video

COVID-19 Wave Must Be Fought without Vaccines : WHO వ్యాక్సిన్ పై నమ్మకం పెట్టుకోవడం తప్పు...!!

కరోనా వ్యాక్సిన్ ఇప్పటికి రాలేదు .. ఇక ముందు రాదు : బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలుకరోనా వ్యాక్సిన్ ఇప్పటికి రాలేదు .. ఇక ముందు రాదు : బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

కోవిడ్ వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ జయించాలన్న డబ్ల్యూహెచ్ఓ

కోవిడ్ వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ జయించాలన్న డబ్ల్యూహెచ్ఓ

అయితే కరోనా వ్యాక్సిన్ మాత్రమే కరోనాని నిరోధించడానికి ఆయుధం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోందని హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా, కరోనా సెకండ్ వేవ్ ను వ్యాక్సిన్ లేకుండానే జయించాల్సిన సమయమని హెచ్చరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ కరోనా వైరస్ విస్తరణతో పోరాడుతున్న దేశాలు ప్రస్తుతం వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ ను అధిగమించాలని ఆయన చెబుతున్నారు.

వ్యాక్సిన్ కోసం చూస్తూ వ్యక్తిగత జాగ్రత్త పాటించకుంటే ఇబ్బందే

వ్యాక్సిన్ కోసం చూస్తూ వ్యక్తిగత జాగ్రత్త పాటించకుంటే ఇబ్బందే

వ్యాక్సిన్ కోసం చూస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుంటే దారుణ పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ ఆయన హెచ్చరిస్తున్నారు . ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనేది తెలియని కారణంగా వ్యాక్సిన్ పై నమ్మకం పెట్టుకొని, అదే మ్యాజిక్ సొల్యూషన్ అని భావించి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బంది పడతారు అంటున్నారు. కరోనా వైరస్ ను విజయవంతంగా ఎదుర్కోవడానికి అనేక కంపెనీలు వ్యాక్సిన్ తయారీ కోసం పోటీ పడుతున్నాయి . కొన్ని వ్యాక్సిన్ లు వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి.

 కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తత అవసరం .. వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారం కాదు

కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తత అవసరం .. వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారం కాదు

ట్రయల్స్ లో ఉన్న టీకాలు అందుబాటులోకి రావడానికి 4 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ లు మాత్రమే సమస్యలు పరిష్కరిస్తాయి అనుకోవడం తప్పు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వస్తుందని కరోనా నిబంధనలు పక్కనపెడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ పేర్కొన్న ఆయన కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తత అవసరమన్నారు.

 95 శాతం ప్రభావవంతంగా ఫైజర్ సంస్థ కరోనా వ్యాక్సిన్

95 శాతం ప్రభావవంతంగా ఫైజర్ సంస్థ కరోనా వ్యాక్సిన్



కరోనా వ్యాక్సిన్ విషయంలో ఫైజర్ బుధవారం తన ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను పూర్తి చేసిన అధ్యయనం 95 శాతం ప్రభావవంతంగా ఉందని తేలిందని, తోటి అమెరికా సంస్థ మోడెర్నా ఈ వారం తన సొంత అభ్యర్థి 94.5 శాతం ప్రభావవంతంగా ఉందని తెలిపింది. రష్యా తన అభ్యర్థి 90 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని పేర్కొంది.

గత డిసెంబర్‌లో చైనాలో వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కనీసం 55.6 మిలియన్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్లకు పైగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని తెలుస్తుంది.

English summary
The WHO emergencies director Michael Ryan said vaccines should not be seen as a "unicorn" magic solution and countries battling a resurgence of the virus second wave would once again have to "climb this mountain" without them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X