వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: క్యాబ్ డ్రైవర్‌పై ఉమ్మేసిన కరోనా బాధితుడు, నెల రోజులకే మృతి, ఏం జరిగిందంటే?

|
Google Oneindia TeluguNews

లండన్: నల్ల జాతీయుడైన ఓ క్యాబ్ డ్రైవర్ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. 9 పౌండ్లు ప్రయాణ ఛార్జీ ఇచ్చేందుకు నిరాకరించిన ఓ ప్రయాణికుడు.. బాధిత కారు డ్రైవర్‌పై ఉమ్మేయడంతో అతనికి కరోనా సోకింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.

పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా పాజిటివ్: వరుడు సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకిపెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా పాజిటివ్: వరుడు సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకి

గుండె పగిలిందంటూ డ్రైవర్ భార్య..

గుండె పగిలిందంటూ డ్రైవర్ భార్య..

గత నెల రోజులుగా రాయల్ లండన్ ఆస్పత్రి కరోనా వార్డులో చికిత్స పొందిన బాధితుడు ట్రేవర్ బెల్లె(61) ఒంటరిగా మరణించాడు. సామాజిక దూరం నిబంధనల నేపథ్యంలో అతని అంత్యక్రియల్లో కేవలం 20 మంది మాత్రమే పాల్గొన్నారు. ట్రేవర్ మరణ వార్తతో గుండె పగిలిందంటూ ఆయన భాగస్వామి కెల్లీ ఈస్క్వాలాంట్ అన్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరోనా అంటించాలనే ఆలోచన నిందితుడికి ఎలా వచ్చిందనేది తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు.

మార్చి 22న కరోనా దాడి..

మార్చి 22న కరోనా దాడి..

మార్చి 22న ట్రేవర్ పై కరోనా దాడి జరిగింది. అయితే, కారును ఎంతో శుభ్రంగా ఉంచడంతోపాటు ప్రయాణికులతో ఎంతో స్నేహపూర్వకంా ఉండే తన భర్తకు ఇలా జరగడంపై కెల్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త కారుకు మంచి ర్యాంక్ ఉందని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆయన చాలా ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకున్నారని తెలిపారు.

డబ్బులు ఇవ్వకుండా.. కరోనా తీసుకోమంటూ..

డబ్బులు ఇవ్వకుండా.. కరోనా తీసుకోమంటూ..

ఐరీస్ యాక్సెంట్‌లో మాట్లాడిన ప్రయాణికుడు(కరోనా బాధితుడు) ట్రేవర్‌పై ఉమ్మివేసి అక్కడ్నుంచి పరారయ్యాడు. పోలీసు వ్యాన్ సమీపంలోనే ఈ ఘటన జరిగిందని ట్రేవర్ తెలిపాడు. ప్రయాణ ఛార్జీ అయిన 9 పౌండ్లు ఇచ్చేందుకు నిరాకరించిన ప్రయాణికుడు తనపై ఉమ్మివేసి పరారయ్యాడని ట్రేవర్ తన మరణానికి ముందు వివరించాడు. తనకు కరోనా ఉందని.. నీవు కూడా తీసుకో అంటూ ఉమ్మివేశాడని తెలిపాడు.

Recommended Video

Lockdown : Ramadan Festival Sales Fall Down @ Charminar Due To Corona Lockdown
కరోనా దాడితో కుదేలైన ట్రేవర్..

కరోనా దాడితో కుదేలైన ట్రేవర్..


కాగా, ఆ దాడి తర్వాత ట్రేవర్ కారు నడపలేదు. నాలుగు రోజులకే అస్వస్థతకు గురైన అతడు ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతనికి కరోనా సోకిందని వైద్యులు తేల్చారు. దీంతో అతడు అక్కడే చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. తన భార్యను కూడా కలవలేదు. ఆరోగ్యం క్షీణించడంతో ఏప్రిల్ 18న అతడు ప్రాణాలు కోల్పోయాడు. ట్రేవర్ తన 61 పుట్టిన రోజు తర్వాత ఇలా జరిగిందని కెల్లీ భావోద్వేగానికి గురయ్యారు.

English summary
Covid-19: Taxi driver dies after passenger spat on him to spreadvirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X