వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్‌పై రష్యా గుడ్‌ న్యూస్‌-స్పుత్నిక్‌-వీ 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడి

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సిన్‌ కోసం జరుగుతున్న ప్రయోగాల్లో అందరి కంటే ముందున్న రష్యా మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనాపై పోరు కోసం తాము అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ప్రయోగాల మధ్యంతర నివేదికను విడుదల చేసింది. ఇందులో వ్యాక్సిన్ కరోనా రోగులపై 92 శాతం ప్రభావ వంతంగా పనిచేస్తుందని ప్రకటించింది. దీంతో త్వరలో వ్యాక్సిన్‌ విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపింది.

 కరోనా వ్యాక్సిన్ కోసం సామాన్యులు 2022 వరకూ ఆగాల్సిందే: ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు కరోనా వ్యాక్సిన్ కోసం సామాన్యులు 2022 వరకూ ఆగాల్సిందే: ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి (ఆర్డీఐఎఫ్‌) సాయంతో రష్యా రక్షణశాఖ, గమలేయా పరిశోధనా సంస్ధ అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. తొలి విడతగా దీన్ని 16వేల మంది కరోనా వైరస్‌ సోకిన వారిపై ప్రయోగించారు. ఇందులో 92 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వ్యాక్సిన్‌ను నమోదు చేసిన తొలి దేశంగా ఈ ఏడాది ఆగస్టులో రష్యా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మూడోదశ ప్రయోగాల దశలో భాగంగా 40 వేల మందికి ప్లేస్‌బో షాట్‌ ఇస్తున్నారు. అంతకు ముందు 16 వేల మందికి రెండు దశల టీకాలు ఇవ్వగా వీరిలో 92 శాతం మంది కోలుకున్నట్లు రష్యా చెబుతోంది.

COVID-19 vaccine: Sputnik V 92% effective against coronavirus, claims Russia

స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను భారత్‌లో అభివృద్ధి చేయడంతో పాటు పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ ల్యాబ్‌తో రష్యా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 100 మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులను భారత్‌కు పంపనుంది. వీటితో రెడ్డీస్‌ ల్యాబ్‌ రెండు, మూడు దశల ట్రయల్స్‌ చేపట్టనుంది.
మూడో దశ ట్రయల్స్‌ వచ్చే ఏడాది మే నాటికి పూర్తవుతాయని అంచనా. స్పుత్నిక్‌ వీ దీర్ఘకాలం పాటు కరోనా వైరస్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుందని రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఇది కనీసం రెండేళ్ల వరకూ కరోనా రాకుండా అడ్డుకోగలదని ఓ అంచనా. భారత్‌లో పిఫిజర్‌, బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌పై చేస్తున్న వరుస ప్రకటనల నేపథ్యంలో రష్యా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

English summary
Sputnik V, Russia's experimental COVID-19 vaccine is 92% effective at protecting people from coronavirus, according to interim trial results, the Russian Direct Investment Fund (RDIF) said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X