వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ముందు జాగ్రత్త: 330 మిలియన్ల జనాభాకు 800 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ల ఆర్డర్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచంలోనే అనేక దేశాలను కకావికలం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి దేశాల్లో అమెరికా ముందుంది. కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న మోడెర్నాతో అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 1.525 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.

మోడెర్నాతో యూఎస్ 995 మిలియన్ డాలర్ల ఒప్పందం

మోడెర్నాతో యూఎస్ 995 మిలియన్ డాలర్ల ఒప్పందం

మోడెర్నాతోపాటు మరో ఐదు కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలతో కూడా అమెరికా ప్రభుత్వతం వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఒప్పందాలు చేసుకుంది. మోడెర్నాతో తాజా రెండో ఒప్పందం కూడా చేసుకుంది. ఇంతకుముందే, టీకా అభివృద్ధికి మొదటిసారిగా ఉపయోగించబడుతున్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం అమెరికా ప్రభుత్వం 995 మిలియన్ డాలర్లను కంపెనీకి వాగ్దానం చేసింది. మోడెర్నా అభ్యర్థి వ్యాక్సిన్ మానవులలో రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడానికి నావల్ కరోనావైరస్ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏను ఉపయోగిస్తుంది. కాగా, ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ ఇప్పటివరకు ఏ వ్యాధికి తయారు చేయలేదు.

400 మిలియన్ల డోసులకు 2.48 బిలియన్ డాలర్ల ఒప్పందం.. 2021 నాటికి

400 మిలియన్ల డోసులకు 2.48 బిలియన్ డాలర్ల ఒప్పందం.. 2021 నాటికి

ఈ రెండు ఒప్పందాలు కలిపి మోడెర్నా వ్యాక్సిన్‌లో యూఎస్ ప్రభుత్వం నిబద్ధతను 2.48 బిలియన్ డాలర్ల మొత్తం తెలియజేస్తోంది. ఈ డబ్బులో పేర్కొనబడని భాగం.. టీకాను సకాలంలో పంపిణీ చేయడానికి ప్రోత్సాహకంగా భావించబడుతుంది, కానీ, ఈ కంపెనీ మాత్రం ఏ సమయానికి అందిస్తామనేది వెల్లడించలేదు. అదనంగా 400 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

మోడెర్నా వ్యాక్సిన్ మానవ పరీక్షల చివరి దశలో ఉంది.. 2021 ప్రారంభంలో ఆమోదం కోసం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌తోపాటు సంస్థలతో 700 మిలియన్ డాలర్ల ఒప్పందం

ఆక్స్‌ఫర్డ్‌తోపాటు సంస్థలతో 700 మిలియన్ డాలర్ల ఒప్పందం

ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అనే కార్యక్రమం ద్వారా జనవరి 2021 నాటికి నావల్ కరోనావైరస్ వ్యాక్సిన్ కనీసం 300 మిలియన్ మోతాదులను పొందటానికి అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటివరకు, యునైటెడ్ స్టేట్స్ వేర్వేరు సంస్థలతో కనీసం 700 మిలియన్ మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది, వీటి అభ్యర్థులకు ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేగాక, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన 300 మిలియన్ డోసులను పొందేందుకు 1.2 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని అమెరికా ఇప్పటికే కుదుర్చుకోవడం గమనార్హం.

330 మిలియన్ల జనాభాకు 800 మిలియన్ డోసుల ఆర్డర్లు

330 మిలియన్ల జనాభాకు 800 మిలియన్ డోసుల ఆర్డర్లు

100 మిలియన్ డోసుల కోసం నోవావాక్స్‌‌తో అమెరికా మరో 1.6 బిలియన్ల యూఎస్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు టీకాపై సహకరిస్తున్న సనోఫీ, గ్లాక్సో స్మిత్‌లైన్‌లతో అతిపెద్ద ఒప్పందం ఉంది. 100 మిలియన్ మోతాదులను పొందటానికి అమెరికా ప్రభుత్వం 2.1 బిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది. 100 మిలియన్ మోతాదుల సరఫరా కోసం అమెరికా జాన్సన్ అండ్ జాన్సన్‌తో ఒక బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. మరో 100 మిలియన్ మోతాదులకు ఫైజర్, బయోటెక్‌తో మరో 1.95 బిలియన్ డాలర్ల ఒప్పందం ఉంది. అంటే 330 మిలియన్ల జనాభాకు 800 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ కోసం యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ, అభివృద్ధి చేస్తున్న టీకాలన్నీ విజయవంతం కాకపోవచ్చు. ఏ అభ్యర్థి వ్యాక్సిన్ విజయవంతమై, రేసులో గెలుస్తోందో.. అవి యునైటెడ్ స్టేట్స్ సరఫరాకు హామీ ఇస్తుందని వైవిధ్యీకరణ నిర్ధారిస్తుంది.

భారత ‘సీరం'తో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, గవి ఒప్పందం..

భారత ‘సీరం'తో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, గవి ఒప్పందం..

భారతదేశంలో, పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్.. మధ్య, తక్కువ ఆదాయ దేశాలకు 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ల తయారీ, సరఫరా కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, గవి అనే గ్లోబల్ టీకా కూటమి నుండి నిధులు పొందింది. ఈ టీకాలు ఏ ప్రముఖ డెవలపర్‌ల నుండైనా కావచ్చు. ఇందులో 50 శాతం భారత్‌కు సరఫరా అవుతుందని భావిస్తున్నారు.అదనంగా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో అభివృద్ధి చేస్తున్న టీకా అభ్యర్థి ఉత్పత్తి, సరఫరా కోసం సీరం ఇనిస్టిట్యూట్.. దాని భాగస్వామి అయిన ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ టీకా కోసం, భారతదేశంలో ఫేజ్ 2, ఫేజ్ -3 ట్రయల్స్ నిర్వహించడానికి సీరంకు ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అనుమతి కూడా లభించింది. కాగా, రష్యా కూడా కరోనా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 20 దేశాలు వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు చేసినట్లు రష్యా తెలిపింది.

English summary
Coronavirus Vaccine Tracker, August 13: The United States government has entered into a US$ 1.525 billion deal with Moderna, a US-based biotech company, for securing the supply of 100 million doses of the novel Coronavirus vaccine that the company is developing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X