• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్: పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కేసుల పెరుగుదలకు ఇండియన్ వేరియంటే కారణమా

By BBC News తెలుగు
|
నేపాల్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి

భారతదేశంలో కోవిడ్ సంక్షోభం పొరుగు దేశాలనూ ఆందోళనకు గురిచేస్తోంది.

అక్కడి వైద్య వ్యవస్థలు పెరుగుతున్న కోవిడ్ కేసులను తట్టుకోలేవేమోననే భయం కూడా ఉంది. దాంతో, చాలా దేశాలు భారత్‌తో రాకపోకలపై ఆంక్షలు విధించాయి.

మార్చి నుంచి భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కొద్దివారాలుగా కేసులు అమాంతం పెరిగిపోయాయి.

గ్రాఫ్

ఇప్పుడు భారత్ పొరుగు దేశాల్లోనూ కోవిడ్ కేసులు పెరగడం కనిపిస్తోంది.

నేపాల్‌లో మాత్రం ఏప్రిల్ నుంచి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆ దేశంలో కోవిడ్ పరీక్షలు చేసిన వారిలో 40 కంటే ఎక్కువ శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయని ఆ ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ఆధారంగా రెడ్ క్రాస్ పేర్కొంది.

నేపాల్ భారతదేశంతో 1,880 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. చాలా మంది ప్రజలు వ్యాపారం, పర్యటకం, కుటుంబాలను కలిసేందుకు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు.

నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర భారత పర్యటనకు వచ్చి వెళ్లిన తరువాత కోవిడ్ బారిన పడ్డారు. అయితే, ఆయనకు వైరస్ ఎలా సోకిందనే విషయంలో స్పష్టత లేదు.

నేపాల్ అధికారులు మార్చి నుంచి భారత్‌తో సరిహద్దుల వద్ద అదనపు వైద్య పరీక్షలను నిర్వహించడం మొదలుపెట్టారు.

మే 1న సరిహద్దులలోని 20కి పైగా ఎంట్రీ పాయింట్లను మూసేశారు.

వివిధ దేశాల్లో జరుగుతున్న పరీక్షల సంఖ్య పై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏప్రిల్ 29 నుంచి కఠ్మాండూలో కోవిడ్ నిబంధనలను విధించారు.

బంగ్లాదేశ్‌లో..

మార్చి ప్రారంభం నుంచి బంగ్లాదేశ్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో ఏప్రిల్ 5 నుంచి అక్కడ కూడా లాక్ డౌన్ విధించారు.

ఇది మే 16 వరకు అమలులో ఉంటుంది. భారతదేశంతో ఉన్న సరిహద్దులను కూడా మూసేశారు. ఏప్రిల్ 26 నుంచి ప్రయాణికుల రాకపోకలను నిలిపేశారు.

కొంత మందిని మాత్రం సరిహద్దు దాటడానికి అనుమతి ఇస్తున్నారు.

సరిహద్దుల మూసివేత తరువాత నుంచి కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.

పాకిస్తాన్ ఇరాన్ తో సరిహద్దులను మూసేసింది.

పాకిస్తాన్‌లో..

పాకిస్తాన్‌లో కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి ఆ దేశ వైద్య వ్యవస్థ పై ఒత్తిడి తెస్తుందేమోననే భయం కూడా ఉంది.

భారతదేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ లేనప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కోవిడ్ నిబంధనలను విధించారు. కొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్లను ప్రకటించాయి. మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. కొన్ని చోట్ల సైన్యం కూడా సహాయం చేస్తోంది.

భారతదేశం, అఫ్గానిస్తాన్, ఇరాన్ నుంచి ప్రయాణించే వారికి ప్రయాణ నిబంధనలు విధించారు.

శ్రీ లంకలో కూడా ఏప్రిల్ మధ్య నుంచి కేసులు ఒక్కసారిగా పెరగడం మొదలయింది. దాంతో కొన్ని చోట్ల పాఠశాలలు మూసేశారు.

మతపరమైన సమావేశాలపై నియంత్రణలు విధించారు. భారతదేశంతో రాకపోకలను నిషేధించారు.

కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?

పొరుగు దేశాల్లో కేసులు పెరగడానికి ఇండియా వేరియంట్ కొంతవరకు కారణమనే భయాలు వినిపిస్తున్నాయి.

ఈ వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందుతుందో లేదోననే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు.

కానీ, ఈ కొత్త వేరియంట్లు మరెక్కడి నుంచైనా కూడా వచ్చి ఉండవచ్చు.

నేపాల్ రెండు నెలల క్రితం సేకరించిన 15 శాంపిళ్లను హాంకాంగ్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ల్యాబ్ కు పంపించింది. అందులో యూకే వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు.

పాకిస్తాన్‌లో కూడా ఏప్రిల్లో చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్లో అత్యధిక శాంపిళ్ళలో యూకే వేరియంట్ కనిపించింది. దక్షిణాన ఉన్న సింధ్ ప్రాంతంలో కూడా దక్షిణ ఆఫ్రికా బ్రెజిల్ వేరియంట్లు ఉన్నట్లు వైద్య అధికారులు గుర్తించారు.

ఇదే సౌత్ ఆఫ్రికా వేరియంట్ బంగ్లాదేశ్‌లో కనిపించింది.

కానీ, ఈ దేశాల్లో చాలా తక్కువ స్థాయిలో జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోంది. అయితే, ఈ కొత్త వేరియంట్లే ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కారణమా అనేది చెప్పడానికి మాత్రం తగినంత సమాచారం లేదు.

గ్రాఫ్

ఇక ఆ దేశాల్లో కోవిడ్ పరీక్షల విషయానికి వస్తే ప్రతి కొత్త కేసుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన సంఖ్య కంటే తక్కువగా గాని, లేదా 10-30 మధ్యలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తక్కువ స్థాయిలో పరీక్షలు జరుగుతున్నప్పుడు కూడా అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే, ఇన్ఫెక్షన్ అసలైన స్థాయిని మ్యాప్ చేయలేదనే అర్ధం.

రాజకీయ నాయకుల నుంచి వచ్చే అస్పష్టమైన సందేశాలతో ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం మానేయడం కూడా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తక్కువ స్థాయిలో వైద్య సదుపాయాలూ, పెరిగిన కేసుల తాకిడి తట్టుకోలేక పాకిస్తాన్‌లో కోవిడ్ నిబంధనలు అమలు చేసేందుకు సైన్యం సహాయం కూడా తీసుకుంటున్నారు.

వ్యాక్సినేషన్ ఎలా కొనసాగుతోంది?

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగకపోవడం కూడా ఆందోళన కలిగిస్తున్న అంశంగా ఉంది.

జనవరి నుంచి ఇక్కడ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాయి. కానీ, వాటి వల్ల ప్రయోజనం చేకూరేంత స్థాయిలో వ్యాక్సినేషన్ అమలు జరగలేదు.

తాజాగా లభించిన సమాచారం ప్రకారం ప్రతి 100 మంది జనాభాకు నేపాల్ 7 .2.. బంగ్లాదేశ్ 5.4 , పాకిస్తాన్ 1, శ్రీ లంక 4. 8, అఫ్గానిస్తాన్ 0. 6 డోసులను ఇచ్చాయి.

యూకేలో ప్రతి 100 మందికి 76 డోసులు, అమెరికాలో 75, యూరోపియన్ యూనియ‌న్‌లో 37, చైనాలో 20కు పైగా డోసులు ఇస్తున్నారు.

భారతదేశంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయో టెక్ ఉత్పత్తి చేసిన వ్యాక్సీన్లను పొరుగు దేశాలకు విరాళంగా కూడా ఇచ్చింది.

అయితే, ప్రస్తుతం దేశంలో కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సీన్ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపేసింది.

దీంతో పాటు అంతర్జాతీయ సరఫరాకు నియమించిన కో వాక్స్ వ్యాక్సీన్ పథకంతో సరఫరా సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో వ్యాక్సీన్ సరఫరాలో జాప్యం జరుగుతోంది.

చైనా నుంచి సైనోఫార్మ్ వ్యాక్సీన్ వచ్చే వరకు నేపాల్, శ్రీ లంక కూడా ఆ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను మధ్యలో కొంత కాలం నిలిపేశాయి.

పాకిస్తాన్ కూడా వ్యాక్సిన్ల కోసం చైనా, రష్యాలపై ఆధారపడింది.

(అదనపు రిపోర్టింగ్: కఠ్మాండూ నుంచి కృష్ణ ఆచార్య, ఢాకా నుంచి వలియూర్ రెహమాన్ మిరాజ్ )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid: Is the Indian variant responsible for the increase in cases in Pakistan, Nepal, Bangladesh and Sri Lanka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X