వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆవు పేడ: రికార్డు సృష్టించిన బస్సు స్పీడు

|
Google Oneindia TeluguNews

లండన్: హిందువులకు పవిత్రమైన ఆవు తన పేడతో అద్భుతం సృష్టించింది. తన పేడ పెట్రోల్, డీజల్ కంటే ఏమి తీసిపోదని నిరూపించింది. ఆవు పేడతో ఒక అత్యాధునికమైన బస్సును గంటకు 123.57 కిలో మీటర్లు నడపవచ్చని నిరూపించారు.

ఆవు పేడతో వంట గ్యాస్, విద్యుత్ తయారు చేశారు. ఆవు పేడను అనేక విదాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే మొదటి సారి ఒక బస్సుకు ఆవు పేడ వేసి అత్యంత వేగంగా నడపవచ్చని నిరూపించారు. లండన్ లోని బెడ్ ఫోర్డ్స్ లోని మిల్ బ్రూక్ గ్రౌండ్స్ లో బుధవారం ఈ పరీక్ష నిర్వహించారు.

అత్యాధునిక మైన బస్సు ఆవు పేడతో గంటకు 123.57 కిలో మీటర్ల వేగంగా ప్రయాణించి రికార్డు సృష్టించింది. బస్సు పై కప్పు మీద ఎర్పాటు చేసిన 7 ట్యాంకులలో ఆవు పేడను నింపుతున్నారు. తరువాత ఆ ట్యాంకులలో ఉద్బవించే బయోమీథేన్ గ్యాస్ ఆదారంగా ఈ బస్సు ప్రయాణిస్తున్నది.

Cow poo bus record speed 123.57 kilometres per hour.

బస్సులోని ప్రయాణికులకు ఆవు పేడ వాసన రాకుండా పలు జాగ్రతలు తీసుకున్నామని తయారీదారులు అంటున్నారు. ఇంత చేసినా గిన్నీస్ బుక్ రికార్డులో చోటు దక్కలేదు. గిన్నీస్ బుక్ రికార్డులో గంటకు 250 కిలో మీటర్ల వేగంతో నడిచే బస్సు రికార్డు ఉంది.

త్వరలోనే ఆవు పేడతో 250 కిలో మీటర్ల వేగంతో బస్సు నడిపి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకుంటామని వారు అంటున్నారు. మొత్తం మీద ప్రపంచంలో ఆవు పేడతో అత్యంత వేగంగా నడిచే బస్సు అందరిని ఆకర్షిస్తున్నది.

English summary
It runs on biomethane compressed natural gas and is painted black and white like a Friesian cow. It normally carries passengers around Reading.The UK Timing Association confirmed the new record.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X