వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్షధ్వానాల మధ్య అంత్యక్రియలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కెన్యా:ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించే సమయంలో అందరూ భోరున ఏడుస్తారు. చివరి చూపును చూసే సమయంలో వారు పడే భాద మాములుగా ఉండదు. ఎంత కఠినంగా ఉండేవారైనా కన్నీళ్లు పెట్టుకొంటారు. అయితే కెన్యాలో మాత్రం ప్రజలు హర్షధ్వాన్యాలు చేస్తుండగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదేం వింత అనుకొంటున్నారా....అంత్యక్రియలు మనుషులకు కాదు.. తుపాకులకు...అందుకే జనం చప్పట్లు కొట్టి మరీ తమ హార్షాన్ని తెలిపారు.

కెన్యా దేశంలో చోటుచేసుకొన్న ఘటన వింతగా అనిపిస్తోంది. సంఘవిద్రోహశక్తుల నుండి , ఉగ్రవాదుల నుండి అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకొంది.ఈ ఆయుధాలు తిరిగి సంఘవిద్రోహశక్తులకు చేరకుండా అక్కడి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొంది. ఈ ఆయుధాలకు నిప్పుపెట్టింది.

cremation to weapons in kenya

ఉగ్రవాదులు, సంఘవ్యతిరేక శక్తుల నుండి సుమారు 5250 ఆయుధాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. ఈ ఆయుధాలను 15 అడుగుల ఎత్తులో మూడు చితులుగా పేర్చింది ప్రభుత్వం. ఈ చితులపై పెట్రోలు పోసి కెన్యా ఉపాధ్యక్షుడు విలియం రూటో నిప్పుపెట్టాడు.చితుల్లో ఆయుధాలు తగులబడుతోంటే ప్రజలు హర్షద్వానాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రజలు స్వచ్చంఢంగా ఇచ్చిన ఆయుధాలు ఎక్కువగా ఉన్నట్టు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది.మరికొన్ని ఉగ్రవాదులు, సంఘవిద్రోహశక్తుల నుండి స్వాధీనం చేసుకొన్నట్టు ప్రకటించింది.ఈ వీడియో విలియం తన పేస్ బుక్ లో పోస్టు చేశాడు.సోమాలియాలో విధ్వంసం సృష్టిస్తోన్న ఆల్ షబీబ్ అనే సంస్థ కెన్యాలో కూడ అడుగిడే ప్రయత్నం చేస్తోందని, ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అక్రమ ఆయుదాలను సరఫరాచేస్తోందని ఆయన చెప్పారు.ఇంకా దేశంలో 5 లక్షల ఆయుధాలు ఉన్నట్టు చెప్పారు.

English summary
5250 illegal weapons seized kenya government. government seized these weapons from anti social elements, terrorists.around 5250 weapons arrange 15 feet heights, then creamation to weapons kenya vice president william ruto post the photo of weapons cremation.another 5 lakhs illegal weapons also seized
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X