వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ప్రజలకు ధన్యవాదాలు: జో బిడెన్.. మరింత కష్టపడి పనిచేస్తా..

|
Google Oneindia TeluguNews

క్షణ క్షణం ఉత్కంఠ.. టెన్షన్.. టెన్షన్... గత నాలుగురోజుల నుంచి యావత్ ప్రపంచం గుక్కపట్టీ మరీ వార్తలను చూసింది, విన్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కోసం నిరీక్షించింది. ఎట్టకేలకు ఫలితాలు వెల్లడయ్యాయి. డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ విజయం సాధించారు. 273 ఓట్లతో అగ్రరాజ్య అధ్యక్ష పీఠాన్ని దక్కించుకొన్నారు. అమెరికాలో అందరికీ హక్కులు, ముస్లింలకు ప్రవేశాలు, కరోనా వైరస్ వ్యాక్సిన్ లక్ష్యంగా చేసిన ప్రచారాలను ప్రజలు విశ్వసించారు. బిడెన్‌కు పట్టం కట్టారు. ఆయనతో భారత సంతతికి చెందిన కమలా హ్యరిస్ జట్టుకట్టనున్నారు. ఆమె ఉఫాధ్యక్ష పదవీ చేపడుతారు.

ప్రపంచంలో గొప్ప, బలమైన దేశం అమెరికా. తనను అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నానని బిడెన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అమెరికా పురోగతి కోసం కష్టపడి పనిచేస్తానని మాట ఇచ్చారు. దీనిపై తాను వాగ్దానం చేస్తున్నానని ట్వీట్ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతానని చెప్పారు. మీరు ఓటు వేసినా.. వేయకున్నా అందరికీ సమానంగా పనిచేస్తానని తెలిపారు.

crickethonored that you have chosen me to president: Joe Biden

1992 నుంచి అమెరికా అధ్యక్ష పదవీ చేపట్టిన ప్రతీ ఒక్కరు రెండుసార్లు ఎన్నికయ్యారు. కానీ ట్రంప్ మాత్రం ఒక్కసారే ఎన్నికై.. రెండోసారి ఓటమి పాలయ్యారు. దీంతో దశాబ్దాలుగా ఉన్న రికార్డును బిడెన్ చెరివపివేశారు. ఈ సారి మెయిల్ బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ప్రభావం చూపించాయి. దాదాపుగా మెజార్టీ ఓట్లు బిడెన్‌కు వచ్చాయి. దీనిపై ట్రంప్ బాహాటంగానే అక్కసు వెళ్లగక్కారు. కానీ ప్రజలు మాత్రం.. మార్పును కోరుకుని.. అధికార మార్పిడిని చేశారు.

ఇదివరకు ఒబామా అధ్యక్షుడిగా ఉండగా.. బిడెన్ ఉపాధ్యక్ష పదవీని చేపట్టారు. డెలావర్‌కు సెనేటర్‌గా కూడా పనిచేశారు. ఇక కమలా హ్యరిసి తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా నిలవబోతున్నారు. అలాగే తొలి నల్ల జాతీయురాలు.. అత్యున్నత పదవీని చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది.

English summary
honored that you have chosen me to president Joe Biden said in tweet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X