వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లజాతీయుడిపై యూఎస్ పోలీసుల దాడి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో ఇంకా నల్లజాతీయులపట్ల వివక్ష కోనసాగుతూనే ఉంది. అందుకు నిదర్శనం ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తాజా ఉదాహరణ. సాక్షాత్తు పోలీసులే నల్లజాతీయుడి మీద దాడులకు దిగారు.

అందుకు ఎలాంటి కారణాలు అవసరం లేదని పోలీసులు నిరూపించారు. మేరిలాండ్ లో పోలీసులు దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మేరిలాండ్ లోని టోసన్ పట్టణంలో ఇటీవల ఓ నల్లజాతీ యువకుడు నడిచి వెలుతున్నాడు.

 Crimes against African Americans in the United States

ఆ సందర్బంలో అతని చేతిలో ఆయుధం ఉందని అనుమానించిన పోలీసులు అతనిని పట్టుకుని విచారించకుండానే చితకబాదేశారు. అతని మీద పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఓ పోలీసు అతనిని పట్టుకుని కిందపడేశాడు.

తరువాత అతని చోక్కా పట్టుకుని అతని మీద పదేపదే దాడి చేశారు. గురువారం ఆ సీసీకెమెరాల్లోని క్లిప్పీంగ్స్ బయటకు వచ్చాయి. కంగుతిన్న పోలీసులు ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ ఎందుర్కోంటున్నారు. నల్లజాతీయుడు ఆ పోలీసుల మీద పై అధికారులకు ఫిర్యాదు చేశాడు.

English summary
A video has emerged showing a police officer repeatedly punching an unarmed black teenager in the town of Towson in Maryland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X