వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడులతో లంకలో సంక్షోభం : ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

కొలంబో : వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంకలో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం 8 చోట్ల, సోమవారం మరో చోట బాంబు పేలడంతో అక్కడ పరిస్థితి భీతావాహంగా మారింది. సోమవారం బాంబులను నిర్వీర్యం చేయడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. 2009 తర్వాత భారీ దాడి శ్రీలంక ఆదివారం ఎదుర్కొంది. 290 మంది మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరిలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు. దీంతో శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడబోతోన్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఆపన్నహస్తం అందించాలని ప్రపంచదేశాలను శ్రీలకం ప్రభుత్వం కోరుతోంది.

 Crisis grows in terror-hit Sri Lanka after fresh explosion

ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకునే ...
లంకలో బాంబు పేలుళ్లలో ఆ దేశ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజా భద్రత దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ విధించినట్టు మీడియాకు తెలిపింది. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ ప్రకటించారు. లంకలో పేలుళ్లకు పాల్పడింది నేషల్ తౌహిత్ జమాతే అని అక్కడి మీడియాలో ప్రచారం సాగింది. దేశంలో మారణహోమం సృష్టించే అవకాశం ఉన్నదని నిఘా వర్గాలు ప్రభుత్వానికి తెలియజేశామని చెప్తున్నాయి. కానీ అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.

విదేశీ ఉగ్రవాదుల హస్తం ?
దేశంలో దాడి దృష్ట్యా ఇతర దేశాల సాయం కోరినట్టు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. శ్రీలంకలోని ఉగ్రవాదులకు విదేశాలకు చెందిన ఉగ్రవాదులు సాయం చేసి ఉంటారని ఆయన భావిస్తున్నారు. దాడిలో చనిపోయిన కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీనిచ్చారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల కోసం నగదు అందజేశారు. గాయపడ్డ వారికి కూడా పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.

English summary
A ninth explosion went off in Sri Lankan capital of Colombo on Monday, just a day after 290 people were killed in a deadly terror attack. The explosion occurred near the Colombo church that was bombed on Easter Sunday while a police squad was trying to diffuse a bomb."The van exploded when the bomb defusing unit of the STF (Special Task Force) and air force tried to diffuse the bomb," a witness told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X