వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంపెనీ సీఈవో మరణించాడు.. పాస్‌వర్డ్‌లు తెలియవు: వేల కోట్లు బ్లాక్.. ఏం జరిగిందంటే?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/ఒట్టావా: క్రిఫ్టోకరెన్సీకి చెందిన అకౌంట్ పాస్‌వర్డ్ తెలిసిన ఓ కంపెనీ సీఈవో కన్నుమూశాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన 137 డాలర్లు బ్లాక్ అయ్యాయి. ఇది మన లెక్క ప్రకారం దాదాపు రూ.వెయ్యి కోట్లు. క్వాడ్రిగా సీఎక్స్‌ అనే కెనడా క్రిప్టో కరెన్సీ కంపెనీ సీఈవో జెరాల్డ్‌ కాటెన్‌ మృతి చెందాడు.

దీంతో ఆ కంపెనీ ఇన్వెస్టర్లు, ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లావాదేవీలు జరపడానికి కావాల్సిన పాస్‌వర్డ్ అతనికి తప్ప మరెవరికీ తెలియదు. దీంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.

పాస్‌వర్డ్ తెలుసుకునే ప్రయత్నం

పాస్‌వర్డ్ తెలుసుకునే ప్రయత్నం

పాస్‌వర్డ్ ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నాలను కంపెనీ చేస్తోంది. కానీ విఫలమయ్యారు. చేసేదిలేక కంపెనీ వర్గాలు కెనడా క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజిని సంప్రదించారు. రక్షణ కల్పించాలని కోరగా, సానుకూలంగా స్పందించింది. మొత్తానికి ఇప్పుడు 137 మిలియన్ అమెరికన్‌ డాలర్ల క్రిప్టోకరెన్సీకి చెందిన ఖాతాల పరిస్థితి అయోమయంగా మారింది.

భార్య పిటిషన్

భార్య పిటిషన్

చనిపోయిన తన భర్త తరఫున ఖాతాలను నిర్వహించడానికి అతని భార్య పెట్టుకున్న అభ్యర్థనకు అక్కడి కోర్టు అంగీకారం తెలిపింది. అయితే, చనిపోయిన కాటెన్‌ వినియోగించిన కంప్యూటర్‌ పాస్‌వర్డ్‌ తెలియక పోవడంతో దానిని ఎవరమూ వాడలేకపోతున్నామని, దాదాపు 115,000 ఖాతాల వివరాలు అందులో ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎక్కడా పాస్‌వర్డ్ దొరకలేదు. నిపుణులను పిలిపించి కంప్యూటర్లు, కాటెన్ సెల్‌ఫోన్‌ నుంచి పాక్షిక సమాచారం రాబట్టారు. దీంతో కొంత సొమ్మును గుర్తించారు.

మృతిపై అనుమానాలు

మృతిపై అనుమానాలు


మరోవైపు, అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. తనకు బెదిరింపులు సైతం వస్తున్నట్లు చనిపోయిన అతని భార్య తెలిపింది. భారత్‌లో ఓ అనాథ ఆశ్రమంలో సేవా కార్యక్రమాల నిమిత్తం వచ్చిన కాటెన్‌ అనారోగ్యంతో గత నెలలో మృతి చెందినట్లు చెబుతున్నారు.

English summary
Angry investors are demanding answers after a Canadian crypto CEO died without sharing one vital password.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X