వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాను గడగడలాడించిన ఫిడెల్ కాస్ట్రో కన్నుమూత
హవానా: అర్ద శతాబ్ధం పాటు క్యూబాను ఒంటి చేత్తో పరిపాలించి అమెరికాను గడగడలాడించిన ఆదేశ మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విఫ్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రో (90) శనివారం తుదిశ్వాస విడిచారు.
అనారోగ్యం కారణంగా ఆయన శనివారం మరణించారు. ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో విప్లవోధ్యమాన్ని రగిలించి పశ్చిమార్దదేశాల్లో తొలి సామ్యవాద దేశంగా తన దేశాన్ని తీర్చి దిద్దారు. తరువాత అగ్ర రాజ్యం అమెరికాకు నిద్రలేకుండా చేశారు.

ఫిడెల్ కాస్ట్రోను హత్య చేయించడానికి అమెరికా తన గుఢాచార సంస్థ సీఐఏతో ఇప్పటి వరకు 640 సార్లు ప్రయత్నించి విఫలం అయ్యింది. వయోభారంతో ఉన్న ఫిడెల్ కాస్ట్రో 2008లో అధికార పగ్గాలను ఆయన సోదరుడు రౌల్ కాస్ట్రోకి అప్పగించారు. అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్న ఫిడెల్ కాస్ట్రో చివరికి తుదిశ్వాస విడిచారు.