• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీవీ లైవ్ షోలో పిల్లి, న్యూస్ రీడర్ ల్యాప్‌టాప్ పైకెక్కి..

|

టర్కీ: ఓ లైవ్ టీవీ షోలోకి హఠాత్తుగా ఓ పిల్లి వచ్చి, వార్తలు చదువుతున్న వ్యక్తి టేబుల్ పైన కాసేపు తచ్చాడిన సంఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఇదంతా లైవ్ టీవీ షోలో కనిపించింది. ఆ పిల్లి అక్కడున్న న్యూస్ ప్రజెంటర్‌ను లెక్క చేయలేదు.

కాసేపు అటుఇటు తిరిగింది. అతనిని ఇబ్బంది పెట్టింది. టర్కీలోని డెనిజ్‌లిలోని డీఆర్టీ టీవీ స్టూడియోలో 'గుడ్‌ మార్నింగ్‌ డెనిజ్‌లి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రతికల్లో వచ్చిన వార్తలను సమీక్షిస్తూ న్యూస్ రీడర్‌ బిజీగా ఉన్నాడు.

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఆ పిల్లి గదిలోకి దూరి న్యూస్ రీడర్‌ టేబుల్ పైకి ఎక్కింది. దీనిని గమనించిన న్యూస్ రీడర్‌ కాసేపు ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే తన కార్యక్రమాన్ని కొనసాగించాడు.

Curious cat gatecrashes live TV show, sits on presenter's laptop

ఇంతలో అది న్యూస్ పేపర్ల పైన తిరుగుతూ మెల్లిగా అతని ల్యాప్‌టాప్‌ కీబోర్డుపైకి ఎక్కి కూర్చుంది. లైవ్ కెమెరాకు ఓ సమయంలో న్యూస్ ప్రజెంటర్ కంటే పిల్లి ఎక్కువగా కనిపించింది. పిల్లి ఇబ్బందిపెట్టినా కార్యక్రమం అంతరాయం లేకుండా కొనసాగింది.

ఓ లైవ్ టీవీ షోలోకి హఠాత్తుగా ఓ పిల్లి వచ్చి, వార్తలు చదువుతున్న వ్యక్తి టేబుల్ పైన కాసేపు తచ్చాడిన సంఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఇదంతా లైవ్ టీవీ షోలో కనిపించింది. ఆ పిల్లి అక్కడున్న న్యూస్ ప్రజెంటర్‌ను లెక్క చేయలేదు.

English summary
A moggy in Turkey, has become a TV sensation after wandering into a studio and jumping onto the presenter’s table during a live broadcast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X