వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబర్ ఎటాక్: తిరిగి పనిచేస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ఫేస్‌బుక్, వాట్స్ యాప్‌ తిరిగి పనిచేస్తున్నాయి. సుమారు 30 నిమిషాల తర్వాత ప్రారంభమయ్యాయి. ఫేస్‌బుక్ సేవలు ఆగిపోవడానికి గల కారణాలను మాత్రం సంస్ధ అధికారంకగా తెలుపకపోయిన 'సైబర్ ఎటాక్' జరిగి ఉండవచ్చని నెటిజన్లు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతానికి ఫేస్‌బుక్‌లో చేస్తున్న పోస్టులకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. మంగళవారం మధ్యాహ్నాం సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ఫేస్ బుక్, వాట్స్ యాప్‌లు సాంకేతిక సమస్యతో నిలిచిపోయాయి. ఈ రెండింటితో పాటు ఇన్‌స్టాగ్రామ్ కూడా ఆగిపోయింది. సుమారుగా ఉదయం 11.50 గంటల సమయం నుంచి ఫేస్‌బుక్ ఆగిపోయింది. దీంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిస్ధితి సుమారు 30 నిమిషాలకు పైగా కొనసాగింది.

Cyber Attack: Did hackers bring down Facebook and Instagram?

ఫేస్‌బుక్ పని చేయడం లేదంటూ పలువురు ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు. సమస్యను పరిష్కరించి చివరకు సేవలను ప్రారంభించాయి. అంతరాయానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా, ఈ అరగంట సమయంలో ఫేస్‌బుక్ లేని ప్రంపంచం ఎలా ఉంటుందో నెటిజన్లకు తెలిసింది.

English summary
Hundreds of millions of people worldwide were unable to use Facebook and Instagram for around an hour today after an alleged cyber attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X