వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతం పేరుతో కూతురిని బీచ్‌కి బలి చేసిన తండ్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

సంప్రదాయం, మతం పేరుతే తండ్రే కన్న కూతురిని పొట్టనబెట్టుకున్న సంఘటన దుబాయలో చోటు చేసుకుంది. దుబాయ్ పోలీసు సెర్చ్ అండ్ రెస్క్యూ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అక్కడి స్ధానిక మీడియా ఛానెల్‌తో చెప్పిన దాని ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తన జీవితంలో మరిచిపోలేని సంఘటనగా దీనిని అభివర్ణించాడు.

పిక్నిక్‌లో భాగంగా ఆసియాకు చెందిన ఓ కుటుంబం దుబాయ్‌లోని బీచ్‌కి వ్యాహ్యాళికి వచ్చారు. తండ్రితో పాటు పిల్లలు బీచ్‌లో ఈత కొట్టేందుకు దిగారు. ఇలా సరదాగా ఈత కొడుతున్న సమయంలో అలల తాకిడికి తన 20 ఏళ్ల కుమార్తె లోపలికి కొట్టుకుపోయింది.

దీనిని గమనించిన బే గార్డ్స్ (రక్షక సిబ్బంది) పరుగున వచ్చి వారిని రక్షించబోయారు. రక్షించేందుకు వస్తున్న ఇద్దరూ పురుషులే అని గమనించిన తండ్రి తన కూతురిని కాపాడొద్దని, సముద్రంలో మునిగిపోవాలని సూచించాడు.

Dad lets daughter die, rather than be touched by 'strange' rescuer

దీంతో ఆ యువతి నీళ్లలో మునిగి మరణించింది. దీంతో తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకలా చేశావంటూ ప్రశ్నంచారు. యవ్వనంలో ఉన్న తన కుమార్తెను ఎవరైనా పరాయి పురుషుడు తాకితే తమ మతం కఠినంగా శిక్షిస్తుందని, ఆమె ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని సమాధానమిచ్చాడు.

అంతకంటే తమ కుమార్తె చనిపోవడమే మేలు అని భావించి అలా చెప్పానని ఆమె తండ్రి చెప్పాడు. సంప్రదాయం, మతం పేరుతో కన్న కూతురే ఓ తండ్రి నిర్ణయానికి బలైందని డిప్యూటీ డైరెక్టర్ లెప్ట్‌నెంట్ కల్నల్ బురిఖ్ మీడియాతో తెలిపారు.

English summary
A father of a 20-year-old girl let his daughter drown, stopping life guards from rescuing her. He preferred that his daughter die rather than she be touched by a strange man, according to a top official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X