వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1000లైక్స్ కోసం 15అంతస్తుల నుంచి చిన్నారి వేలాడదీత: తండ్రికి జైలు

సోషల్ మీడియాలో లైకులు, కామెంట్స్ కోసం కొందరు నెటిజన్లు తమ జీవితాలతోపాటు ఇతరు జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేందుకు వెనుకాడటం లేదు.

|
Google Oneindia TeluguNews

అల్జీర్స్: సోషల్ మీడియాలో లైకులు, కామెంట్స్ కోసం కొందరు నెటిజన్లు తమ జీవితాలతోపాటు ఇతరు జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల తను పోస్టు చేసిన ఫొటోకు వెయ్యి లైకులు రాకుంటే తన కొడుకును 160ఫీట్ల ఎత్తైన భవనం నుంచి కిందపడేస్తానని బెదిరింపులకు గురిచేశారు. దీంతో నెటిజన్లంతా ఆందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

ఆ వివరాల్లోకి వెళితే.. అల్గేరియాకు చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల చిన్నారిని అతడు వేసుకున్న టీషర్టును మాత్రమే పట్టుకుని 15అంతస్తుల భవనం బాల్కనీ నుంచి వేలాడదీశాడు. సోషల్ మీడియాలో ఈ ఫొటో పెడుతూ.. 'నాకు వెయ్యి లైకులు ఇవ్వండి. లేదంటే చిన్నారిని వదిలేస్తా' అంటూ పోస్టు పెట్టాడు.

Dad who almost dropped toddler for 1,000 likes gets 2 years in jail

ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే చాలా మంది ఆ చిన్నారిని కాపాడేందుకు లైకులు కూడా కొట్టారు. అయితే, మరికొందరు మాత్రం చిన్నారిని హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు.

అయితే, తాను మాత్రం సరదాగా చేశానంటూ నిందితుడు కోర్టులో తెలిపాడు. అయితే, చిన్నారి పొరపాటున కిందపడితే పరిస్థి ఏంటని ప్రశ్నించారు. అంతేగాక, ఫొటోలో చిన్నారిని ప్రమాదకరస్థితిలో పట్టుకున్నాడని నిర్ధారిస్తూ జడ్జీ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

English summary
A man from Algeria reportedly took hold of and suspended his baby out from a 15-floor-high window in a bid to gain some popularity. The father demanded ‘1,000 Facebook likes’ against a threat of dropping his absolutely terrified son from a height of more than 160 feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X