వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్ షూటింగ్: ఐదుగుర్ని చంపింది ఒక్కడే

By Pratap
|
Google Oneindia TeluguNews

డల్లాస్: అమెరికాలోని డాలస్‌లో కాల్పులు జరిపి ఐదుగురిని చంపింది ఒక్కడేనని అధికారులు వెల్లడించారు. డల్లాస్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మరణించిన విషయం తెలిసిందే. అతను 12 మందిపై కాల్పులు జరపగా ఐదుగురు మరణించారు. అతడు అమెరికా మిలిటరీలో మాజీ సైనికుడు. ఆఫ్గాన్‌ యుద్ధసమయంలోసైన్యంలో పనిచేశాడు.

నల్లజాతీయులను పోలీసులు కాల్చి చంపడానికి నిరసనగా డాలస్‌లో జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నిరసన ర్యాలీలో మాటువేసిన దుండగులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఐదుగురు పోలీసులు మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

dallas

ఐదుగురు కూడా ఒక్కరి చేతిలోనే మరణించినట్లు సమాచారం. ఈ ఐదుగురిని చంపిన దుండగుడిని పోలీసులు చుట్టుముట్టి చర్చలు జరిపినప్పటికీ ఫలితం లభించలేదు. దీంతో బాంబు రోబో ద్వారా అతడిని చంపేశారు. కాల్పులు జరిపిన దుండగుడిని మైకా గ్జేవియర్‌ జొహాన్సన్‌గా గుర్తించారు.

కాల్పుల తర్వాత చర్చల సమయంలో అతడు తెల్లజాతీయులను చంపాలని అనుకుంటున్నాని, ముఖ్యంగా తెల్లజాతి అధికారులను చంపుతానని అన్నాడని పోలీసులు వెల్లడించారు. దుండగుడి ఇంట్లో సోదాలు జరిపారు. సోదాల్లో బాంబు తయారీ పదార్థాలు, తుపాకులు, ఆయుధాలు లభించినట్లు అధికారులు తెలిపారు.

డల్లాస్ ఘటనతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దాడిని తీవ్రంగా ఖండించారు. డల్లాస్ ఘటనకు సంతాపంగా అమెరికాలో మంగళవారం వరకు జాతీయ పతాకాలను సగం అవనతం చేయాలని ఒబామా సూచించారు.

English summary
The sniper who shot 12 police officers in the US city of Dallas, killing five and injuring many, during a protest decrying police killings of black men this week, has been identified as a former Army reservist equipped for war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X