వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కొత్త తరహా క్యాంపెయిన్స్... ఓటింగ్‌ను పెంచేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద డ్యాన్స్..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే యువత చాలా తక్కువ. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువతీ యువకులు అక్కడ ఓటింగ్‌కి అంతగా ఆసక్తి చూపించరు. అమెరికా మొత్తం ఓట్లలో 29 ఏళ్ల లోపు యువత 20శాతం ఉండగా.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇందులో సగం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల సీన్ అందుకు భిన్నంగా ఉండబోతుందన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల్లో ఇద్దరు వృద్దులు డొనాల్డ్ ట్రంప్ (74),జో బైడెన్(77) పోటీ పడుతుండటంతో ఈసారి యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నప్పటికీ.. చాలా రాష్ట్రాల్లో ఓటర్లు ముందస్తు ఓటింగ్‌కే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేలా అక్కడి సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నారు. దానికి తోడు కొన్ని గ్రూప్స్ వీధుల్లో,పోలింగ్ కేంద్రాల వద్ద నృత్య ప్రదర్శనలు చేపడుతూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే పోలింగ్ కోసం క్యూ లైన్‌లో నిలుచున్నవారికి ఎంటర్టైన్‌మెంట్ అందిస్తున్నాయి.

dance on polling booths and streets to encourage people to vote in usa

ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఓ డ్యాన్సింగ్ గ్రూప్ చేపట్టిన నృత్య ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #joytothepolls,@JoyToThePolls తదితర హాష్ ట్యాగ్స్‌తో ఆ డ్యాన్సింగ్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

యువత ఓటు ప్రాధాన్యంపై ప్రస్తుతం అమెరికాలో విస్తృతంగా క్యాంపెయిన్స్ నడుస్తుండటంతో ఈసారి యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. యువత ఓటింగ్ పెరిగితే అది ఎవరికి లాభిస్తుందన్న దానిపైనే అధ్యక్ష ఎన్నికల విజయం ఆధారపడి ఉంటుందన్నారు. కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా,మిచిగాన్,అరిజోనా వంటి రాష్ట్రాల్లో అది డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు లాభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పోల్ సర్వేలో దాదాపు 60శాతం మంది యువత జో బైడెన్‌కే ఓటేస్తామని చెప్పడం గమనార్హం.

English summary
People are out in record numbers to cast their ballots early this year, and as news of long lines and hours-long waiting makes the headlines, people are finding unique ways to stay entertained and a video of a group dancing in line to vote in Philadelphia is going viral on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X