• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బడా కంపెనీల్లో డేటా లీక్ - డార్క్‌వెబ్‌లో 23 కోట్ల మంది ప్రొఫెల్స్ - ఇన్‌స్టా, టిక్ టాక్, యూట్యూబ్

|

సోషల్ మీడియా దిగ్గజాలు, రాజకీయ పార్టీల మధ్య చీకటి వ్యవహారాలపై చర్చ తీవ్రస్థాయికి చేరిన వేళ.. భారీ డేటా లీకేజీ కుంభకోణం కలకలం రేపుతున్నది. బడా సోషల్ జెయింట్స్ గా పేరుపొందిన కంపెనీల్లో కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురైంది. ఇటీవల కాలంలో డేటా లీకేజీలు కొత్తకానప్పటికీ, ఒకేసారి ఏకంగా 235 మిలియన్(23.5 కోట్ల) మంది బాధితులు ఉండటంతో దీన్ని అతిపెద్ద లీకేజీగానూ అభివర్ణింస్తున్నారు.

బడా కంపెనీలైన ఫేస్ బుక్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్, చైనీస్ బైట్ డ్యాన్స్ కంపెనీ బ్రాండ్ టిక్ టాక్, గూతుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ ఫ్లాట్ ఫారమ్స్ యూజర్లలో 235 మిలియన్ల మంది సమాచారం డార్క్ లో లీకైనట్లు ''కాంపారిటెక్''అనే రీసెర్చ వెబ్ సైట్ వెల్లడించింది. అత్యధికంగా ఇన్ స్టా నుంచి రెండు విడతలుగా, టిక్ టాక్, యూట్యూబ్ నుంచి ఒక్కో విడతలో డేటా చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా ప్రొఫొల్స్ లోని ఫొటోలు, ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు తదితర సమాచారం మొత్తం ఇప్పుడు డార్క్ వెబ్ లో ఎలాంటి పాస్ వర్డ్ లేకుండా ఉందని 'కామ్ పారిటెక్' తెలిపింది.

శ్రీశైలం ఘోర విషాదం: భయపడ్డట్లే - ఆరుగురి మృతదేహాలు లభ్యం - చాన్స్ ఉందా? కేసీఆర్ కీలక ఆదేశాలు

Database breach exposes profile data for 235M TikTok, Instagram, and YouTube accounts

నిజానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అంతా ఓపెనే, అందులోని సమాచారాన్ని ఎవరైనా సేకరించే వీలుంటుంది. అందుచేత, ఇప్పటి డేటా లీకేజీ ఘటనను హ్యాకింగ్ గా భావించరాదని, కంపెనీల నుంచే గంపగుత్తగా సమాచారం సేకరించడాన్ని 'డేటా ఫిషింగ్' అంటారని, ఇది కచ్చితంగా యూజర్ల భద్రతకు ముప్పు కలిగించే అంశమేనని నిపుణఉలు చెబుతున్నారు. డేటా చోరీలపై ఆయా సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్త వహించడంలేదన్న విమర్శలు కూడా తెలిసిందే.

కరోనా వేళ షాకింగ్ బిజినెస్ - వాడి పారేసిన గ్లవ్స్ మళ్లీ అమ్మకం - ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసా?

ఇన్‌స్టా, టిక్ టాక్, యూట్యూబ్ నుంచి లీకైన యూజర్ల డేటా మొత్తం స్పామర్స్, సైబర్ క్రిమినల్స్‌కు ఉపయోగపడుతుందని కాంపారిటెక్ వెబ్‌సైట్ ఎడిటర్ పాల్ బిస్చెఫ్ అన్నారు. గత నెల షైనీ హంటర్స్‌ అనే హ్యాకింగ్ గ్రూప్ 18 కంపెనీలకు చెందిన 386 మిలియన్ల యూజర్ల డేటాను లీక్ చేయడమే కాకుండా.. ఈ డేటాను అందరూ డౌన్ లోడ్ చేసే విధంగా ఒక ఫోరమ్‌లో అప్ లోడ్ చేశారని గుర్తుచేశారు.

English summary
The security research team at Comparitech today disclosed how an unsecured database left almost 235 million Instagram, TikTok and YouTube user profiles exposed online in what can only be described as a massive data leak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X