వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛాన్స్ మిస్!: 2013లో దావూద్ ఇబ్రహీం వచ్చేవాడా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 2013లో భారత్‌కు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారా? నాటి యూపిఏ ప్రభుత్వాంతో చర్చించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆంగ్ల మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సమాచారం మేరకు... ఢిల్లీ బేస్డ్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు ఒకరు.. దావూద్ ఇబ్రహీం భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ పెద్దలతో ఆనాడు చెప్పారు.

1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత.. దావూద్ ఇబ్రహీం భారత్ తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించారని, ఈ విషయంపై పార్టీలో, ప్రభుత్వంలో పెద్దల స్థాయిలో చర్చ కూడా జరిగిందని తెలుస్తోంది.

Dawood wanted to return to India?

దావూద్ ఇబ్రహీం తిరిగి భారత్ వచ్చే విషయమై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ శివశంకర్ మీనన్‌లు చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది.

అయితే, దీనిపై నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందిస్తూ... ఆ వార్తలను కొట్టిపారేశారు. నేను హోంమంత్రిగా ఉన్న సమయంలో తమకు దావుద్ గురించి ఎలాంటి సమాచారం తెలియదని ఆయన చెప్పారు.

English summary
Underworld don and India's most wanted man, Dawood Ibrahim wanted to return to India in 2013 and had even tried to contact with the then UPA government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X