వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక రాష్ట్రాల్లో బిడెన్‌ ముందంజ- పోలింగ్‌కు ముందే ట్రంప్‌కు ముచ్చెమటలు

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా వైరస్ భయాలతో రేపు జరిగే పోలింగ్‌కు ముందే భారీ సంఖ్యలో ఓటర్లు ముందస్తు పోలింగ్‌లో పాల్గొన్నారు. మెయిల్‌ ద్వారా నిర్వహించిన ఈ పోలింగ్‌లో దాదాపు 10 మిలియన్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటి ఫలితాలు కూడా సూచనప్రాయంగా వెల్లడి కావడం రేపటి పోలింగ్‌పైనా ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

చైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్‌- కరోనాతో డ్రాగన్‌ కొట్టిన దెబ్బను ఎలా మర్చిపోగలమని ప్రశ్నచైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్‌- కరోనాతో డ్రాగన్‌ కొట్టిన దెబ్బను ఎలా మర్చిపోగలమని ప్రశ్న

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన ఐదు స్వింగ్‌ రాష్ట్రాల్లో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఒకరోజు ముందు సర్వే సంస్ధ ఎస్ఎస్‌ఆర్‌ఎస్‌ నిర్వహించిన సీఎన్‌ఎన్‌ పోల్స్‌ ప్రకారం డెమోక్రాట్‌ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌ రెండు కీలక స్వింగ్‌ రాష్ట్రాలైన విస్కాన్సిన్‌, మిచిగాన్‌లో ముందున్నట్లు తేలింది. మరో రెండు రాష్ట్రాలు అరిజోనా, నార్త్‌ కరోలినాలో మాత్రం హోరాహోరీ సాగుతోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ట్రంప్‌ 2016 ఎన్నికల్లో ఆధిక్యం సాధించారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వెనుకబడటం, మరో రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ ఎదుర్కోవడం మంగళవారం జరిగే తుది పోలింగ్‌పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.

day before us election 2020, polls show biden leads trump in two key states

ఇప్పటికే మెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఓటింగ్ ద్వారా తమ బ్యాలెట్లను వేసిన ఓటర్లలో బిడెన్ గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతున్నారని, ఇంకా ఓటు వేయని వారిలో ట్రంప్ గణనీయమైన తేడాతో ముందంజలో ఉన్నారని సర్వేలు పేర్కొన్నాయి.తాజా సర్వే ఫలితాల ప్రకారం ఓట్ల శాంపిల్స్‌ లోపాలు ఎదురైన అరిజోనాలోనూ బిడెన్‌కు 50 శాతం, ట్రంప్‌కు 46 శాతం ఓట్లు పడ్డాయి. విస్కాన్సిన్‌లో బిడెన్‌కు 52 శాతం ట్రంప్‌కు 44 శాతం ఓట్లు పడ్డాయి. అలాగే ఉత్తర కరోలినాలో బిడెన్‌కు 51 శాతం ఓట్లు రాగా.. ట్రంప్‌కు కేవలం 45 శాతం పోలయ్యాయి. అయితే నాలుగుశాతం శాంపిల్‌ లోపాలు ఉన్నట్లు ఎన్నికల అధికారులు చెప్తున్న నేపథ్యంలో అరిజోనా, నార్త్‌ కరోలినా ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ బిడెన్‌ ఆధిక్యానికీ, శాంపిల్ లోపాల శాతాలు దాదాపు సమంగా ఉండటంతో ఫలితాలపై ఆసక్తి పెరుగుతోంది.

న్యూయార్క్‌ టైమ్స్‌, సియానా కాలేజ్‌ నిర్వహించిన పోల్‌ సర్వేల్లోనూ కీలకమైన నాలుగు రాష్ట్రాల్లో ట్రంప్‌ బిడెన్ కన్నా వెనుకబడినట్లు తెలుస్తోంది. 2016లో ఓటు వేయని వారు కూడా ఈసారి బిడెన్‌కు మద్దతుగా వచ్చి ఓటేయడం స్పష్టమైన మార్పుగా చెప్తున్నారు. ప్రధానంగా విస్కాన్సిన్‌లో బిడెన్‌ స్పష్టమైన ఆధిక్యం సాధించినట్లు తేలింది. ఇక్కడ ట్రంప్‌కు వచ్చిన 41 శాతం ఓట్లతో పోలిస్తే బిడెన్‌ 52 శాతంతో భారీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
A day before the US election, Democratic Presidential nominee and former Vice President Joe Biden is leading in the upper Midwest states of Wisconsin and Michigan, as per CNN Polls conducted by SSRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X