వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెకన్ల ముందు: ఇండోనేషియా సునామీ భయానకం(వీడియో): 1,571కి చేరిన మృతుల సంఖ్య

|
Google Oneindia TeluguNews

Recommended Video

సెకన్ల ముందు: ఇండోనేషియా సునామీ భయానకం(వీడియో): 1,571కి చేరిన మృతుల సంఖ్య

జకార్తా: గత కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాలో సంభవించిన భూకంపం, భారీ సునామీ కారణంగా భారీ ఆస్తి నష్టం, వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సునామీ ధాటికి సులవేసి దీవిలోని పాలూ నగరం అతలాకుతలమైంది.

భవనాలు కూలిపోవడంతో వాటి శిథిలాల కింద భారీగా మృతదేహాలు చిక్కుకున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య శుక్రవారానికి 1,571కి చేరినట్లు అధికారులు తెలిపారు. భూకంపం-సునామీ కారణంగా 70 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.

ఇండోనేషియా తీరం తాకిన సునామీ: బీభత్సం సృష్టిస్తున్న భారీ అలలు, నివాసాలు ధ్వంసం(వీడియో)ఇండోనేషియా తీరం తాకిన సునామీ: బీభత్సం సృష్టిస్తున్న భారీ అలలు, నివాసాలు ధ్వంసం(వీడియో)

 Death toll from Indonesias quake, tsunami reach 1,571

కాగా, ఇండోనేషియాలో సంభవించిన సునామీకి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహదారులపైకి ఒక్కసారిగా సునామీ వల్ల చెట్లు, భవనాలు మొత్తం కొట్టుకుని వచ్చేశాయి.

అంతవరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి ఒక్కసారిగా సునామీ నీరు చేరింది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలు సునామీని గుర్తించి వెంటనే తమ కార్లను వెనక్కి వేగంగా తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సునామీ బీభత్సాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

English summary
The official death toll from a powerful earthquake and tsunami that struck the central Indonesian island of Sulawesi a week ago reached 1,571 on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X