వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైకప్పు కూలిపోయిన ఘటనలో 160 మంది మృతి

చర్చి పై కప్పు కూలిన ఘటనలో 160 మంది చనిపోయారు. ఈ ఘటన నైజీరియాలో చోటుచేసుకొంది. ప్రార్థనలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రిస్మస్ పర్వదినానికి ఈ భవనాన్ని సిద్దం చేసే ఉద్దేశ్యంతో త్వరగా పనులు చేస్తున్

By Narsimha
|
Google Oneindia TeluguNews

నైజీరియా :నైజీరియాలో చోటుచేసుకొన్న ప్రమాదం 160 మంది ప్రాణాలను బలిగొంది. ఓ చర్చి పైకప్పు కూలి 160 మంది మరణించారు. ఉయోలోని రిగ్ నర్స్ చర్చి పై కప్పు కూలిన ఘటనలో 160 మంది మరణించారు.

చర్చిలో ఆదివారం నాడు జరిగిన మత కార్యక్రమానికి పెద్ద ఎత్తున క్రైస్తవులు హజరై ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. అక్వాఇబామ్ రాష్ట్ర గవర్నర్ కూడ ఈ సంఘటన జరిగిన సమయంలో చర్చిలోనే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన తప్పించుకొన్నారని అధికారులు ప్రకటించారు.

death toll from nigerian church collapse rises to 160

ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహరీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. చర్చి పై కప్పు కూలిన ఘటనలో శకలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.తొలుత 60 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని ఉడోం ఇమన్మాన్యువల్ దర్యాప్తుకు ఆదేశించారు. చర్చి నిర్మాణదశలోనే ఉంది. క్రిస్మస్ సమీపిస్తోంది. అయితే క్రిస్మస్ నాటికి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని భావించారు.అయితే పై కప్పు పనులను త్వరగా పూర్తి చేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొందని స్థానికులు చెబుతున్నారు.

English summary
nigerian officers says death toll from church collapse incident on saturday has risen to 160.the incident involved the reigners bible church in uyo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X