వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మనిషికంటే ఎక్కువ ఐక్యూ ఉన్న డీప్ లర్నింగ్ మిషన్
బీజింగ్: చైనా పరిశోధకులు ఓ మెషన్ తయారు చేశారు. ఇందులో మనిషిని మించిన తెలివి తేటలు ఉన్నాయి. మనిషి కంటే ఇందులో ఐక్యూ ఎక్కువగా ఉందని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనాకు చెందిన బింగో బృందం ఇటీవల ఓ డీప్ లెర్నింగ్ మెషిన్‌ను రూపొందించింది.
ఈ మిషన్ వెర్బల్ రీజినింగ్ ప్రశ్నలకు కూడా అసాధారణ వేగంతో జవాబు ఇస్తోంది. తద్వారా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐక్యూ పరీక్షలో మనిషిని మించిపోయిందని దీని రూపకర్తల్లో ఒకరైన హ్యూజెంగ్ చెబుతున్నారు.

ప్రశఅనించగానే కంప్యూటర్లు టకీమని జవాబు చెబుతాయి. అయితే, వెర్బల్ రీజినింగ్ విషయంలో మాత్రం అడ్డదిడ్డంగా సమాధానాలు ఉంటాయి. ఈ విషయంలో కంప్యూటర్ సాధారణ తెలివితేటలున్న మనిషి కంటే వెనుకబడి ఉంటుంది. ఇప్పుడు కొత్త మిషన్ మనిషి కంటే ఎక్కువ ఐక్యూ కలిగి ఉందని చెబుతున్నారు.