వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందేళ్లకు గుర్తోంచింది, జలియన్‌వాలాబాగ్ మారణహోమం పై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం,

|
Google Oneindia TeluguNews

ఒకటి కాదు రెండు కాదు, దుర్ఝటన జరిగిన వంద సంవత్సరాల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. 1919 , అమృత్ ‌సర్ లో జరిగిన జలియన్ వాలా బాగ్ కాల్పుల దుర్ఘటన పై బ్రిటిష్ ప్రధాని థెరిసా మే ,పార్లమెంట్ లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా రానున్న ఎప్రిల్ 13నాటికి జలియన్‌వాల బాగ్ నరమేథం జరిగి సరిగ్గా వంద సంవత్సరాలు.

బ్రిటీష్ ప్రధాని తీవ్ర విచారం

బ్రిటీష్ ప్రధాని తీవ్ర విచారం

ఎట్టకేలకు బ్రిటీష్ ప్రభుత్వం భారతీయుల మృతిపై ''తీవ్ర విచారం'' వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర పోరాటంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణహోమంపై బ్రిటిష్ పార్లమెంట్ లోని ప్రతిపక్షనాయకులు జర్మి కార్బైన్ సంఘటనపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే దీనిపై నిన్న అక్కడి పార్లమెంట్ లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో పార్లమెంట్ సభ్యుల మధ్య చర్చ జరిగింది.దీంతో అప్పటి నరమేధంపై క్షమాపణ చెప్పడమే సముచితంగా ఉంటుందని పలువురు సభ్యులు భావించారు.అయితే మరో కొద్ది మంది మాత్రం దీన్ని వ్యతిరేకించారు.దీంతో ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని థెరీసా మే నిర్ణయానికి వదిలేశారు.ఇక అక్కడి భారతీయులు కూడ క్షమాపణలు చెబితేనే బాగుంటుందని భావించారు.ఈనేపథ్యంలోనే నేడు పార్లమెంట్ లో ప్రధాని థేరిసా మే క్షమాపణలు కాకుండా జలియన్ వాలాబాగ్ దుర్గటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు.

క్షమాపణ చెప్పాలి ,ప్రతిపక్ష పార్టీ నేత

క్షమాపణ చెప్పాలి ,ప్రతిపక్ష పార్టీ నేత

అయితే దీనిపై విచారం కాకుండా స్పష్టంగా క్షమాపణ చెబితేనే బాగుంటుందని ప్రధాన ప్రతిపక్షనాయకుడైన జెరెమీ కార్బైన్ పిలుపునిచ్చారు. కాగా 2013 లో బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామేరూన్ కూడ ఇది చాల సిగ్గుపడే అంశమని అన్నారు. కాని దీనిపై ఆయన కూడ క్షమాపణ చెప్పేందుకు వెనకడుగు వేశారు.

1919 ఏప్రిల్ 13 న జలియన్ వాలాబాగ్ నరమేధం

1919 ఏప్రిల్ 13 న జలియన్ వాలాబాగ్ నరమేధం

స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జరిగిన అత్యంత దురదృష్టకరమైన దుర్ఘటన జలియన్ వాలాబాగ్ మారణహోమం . భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా పోరాటయోదులైన సత్యపాల్ , సైఫోద్దిన్ ల అరెస్ట్ కు నిరసనగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో వేలాదీ మంది ప్రజలు సమావేశం అయ్యారు.అయితే ఈ సమావేశానికి అనుమతి ఇవ్వని జనరల్ డయ్యర్ అదేశాలతో బ్రిటీష్ సైన్యం వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది.దీంతో బ్రిటీష్ అధికారిక లెక్కల ప్రకారమే 376 మంది మృతి చెందారు. ఇక భారతీయులు చెబుతున్న సంఖ్య అయితే 1000 మంది కిపై గా కాల్పుల్లో చనిపోయారని చెబుతారు.

English summary
British Prime Minister Theresa May on Wednesday expressed "deep regret" for the Jallianwala Bagh massacre by British troops in India in 1919,"We deeply regret what happened and the suffering caused," Ms May told the British parliament,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X