వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రెండింగ్: #డిలీట్‌ఫేస్‌బుక్.., ఖాతాను ఎలా తొలగించుకోవాలి!

|
Google Oneindia TeluguNews

Recommended Video

#DeleteFacebook : Deletion vs Deactivation, Reasons To Delete Facebook

వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై 'డేటా లీక్' ఆరోపణలు వెల్లువెత్తడంతో.. సంస్థ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. వేలకొద్ది ఖాతాల నుంచి వ్యక్తిగత డేటా లీకైనట్టు ఆరోపణలు వస్తుండటంతో.. ఫేస్‌బుక్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కొంతమంది నెటిజెన్స్ తమ ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో #డిలీట్‌ఫేస్‌బుక్‌ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

అతిపెద్ద కుదుపు?: ట్రంప్ గెలుపుకు ఫేస్‌బుక్‌తో లింకు?, అసలేం జరిగింది? అతిపెద్ద కుదుపు?: ట్రంప్ గెలుపుకు ఫేస్‌బుక్‌తో లింకు?, అసలేం జరిగింది?

 #డిలీట్‌ఫేస్‌బుక్‌:

#డిలీట్‌ఫేస్‌బుక్‌:

డేటా లీక్ అనుమానాలతో.. ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించుకోవడానికి సిద్దపడుతున్నవారు.. ఖాతాను ఎలా తొలగించుకోవాలో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డీ-యాక్టివేషన్, డిలీషన్ అనే రెండు ఆప్షన్స్ లో ఏది ఎంపిక చేసుకోవాలనే దానిపై కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఇది ఫేస్‌బుక్‌ను డిలీట్ చేయాల్సిన టైమ్: వాట్సప్ కో-ఫౌండర్ బ్రియాన్ సంచలనంఇది ఫేస్‌బుక్‌ను డిలీట్ చేయాల్సిన టైమ్: వాట్సప్ కో-ఫౌండర్ బ్రియాన్ సంచలనం

 డీ-యాక్టివేషన్:

డీ-యాక్టివేషన్:

డీ-యాక్టివేషన్ అనేది ఫేస్‌బుక్ ఖాతాను తాత్కాలికంగా కనిపించకుండా చేసే ప్రక్రియ మాత్రమే. ఈ ఆప్షన్ ద్వారా కొంత కాలం వరకే ఫేస్‌బుక్ ఖాతాను ఎవరికీ కనిపించకుండా చేయవచ్చు. ఆ వ్యవధిలో అది ఉనికిలో(యాక్టివ్) లేకుండా పోతుందన్నమాట. ఆ తర్వాత తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

 డిలీషన్.. 90రోజుల్లో:

డిలీషన్.. 90రోజుల్లో:

'డిలీషన్' ఆప్షన్ కు ఫేస్‌బుక్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే.. 'డిలీషన్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత.. 90రోజుల వరకు ఆ ప్రక్రియ నడుస్తుంది. అంటే, ఫేస్‌బుక్ యూజర్ ఖాతాలోని సమాచారం, ఫోటోలు, పోస్టులు, ఇతరత్రా అన్నీ డిలీట్ చేయడానికి ఇంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఇతరులకు మీ ఫేస్‌బుక్ ఖాతా కనిపించదు.

రెండింటికి తేడా:

రెండింటికి తేడా:

నిజానికి డిలీట్ కన్నా డీ-యాక్టివేట్ చాలా సులువైన ప్రక్రియ అయినప్పటికీ.. దీని ద్వారా ఫేస్‌బుక్ ఖాతాలోని పూర్తి సమాచారం తొలగించబడదు. కేవలం ఫేస్‌బుక్ లో కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉంటుంది. మళ్లీ యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు.. యూజర్ ఐడీ , పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయి క్షణాల్లో రీయాక్టివేట్ చేసుకోవచ్చు.

డౌన్ లోడ్ ఫేస్‌బుక్ డేటా..:

డౌన్ లోడ్ ఫేస్‌బుక్ డేటా..:

ఫేస్‌బుక్ ఖాతాను శాశ్వతంగా తొలగించేముందు.. యూజర్స్ అందులోని డేటాను తిరిగి పొందడానికి అవకాశం ఉంది. ఇందుకోసం కింద సూచించబడిన స్టెప్స్ ఫాలో అవాలి.

1. మొదట మీ ఫేస్‌బుక్ ఖాతాలోకి లాగిన్ అవండి

2. ఖాతా ఓపెన్ చేయగానే కుడివైపున టాప్ ఆప్షన్ క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లండి.

3. సెట్టింగ్స్ నుంచి జనరల్ సెట్టింగ్స్ లోకి వెళ్తే.. 'డౌన్‌లోడ్ ఏ కాపీ ఆఫ్ ఫేస్‌బుక్ డేటా' అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయాలి.

4.మీ ఫేస్‌బుక్ డేటా మొత్తం మెయిల్ ద్వారా మీకు అందుతుంది.

 ఎలా డిలీట్ చేయాలి:

ఎలా డిలీట్ చేయాలి:

ఫేస్‌బుక్ ఖాతాను డిలీట్ చేయడానికి సూచనలు

1.ఫేస్‌బుక్ ఖాతాలోకి లాగిన్ అవండి.

2.సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోండి.

3. సెట్టింగ్స్ నుంచి ఎడిట్ ఆప్షన్ ఎంచుకుని.. ఆపై 'మేనేజ్ ఎకౌంట్' ఆప్షన్ క్లిక్ చేయండి.

4.మేనేజ్ ఎకౌంట్ సెక్షన్ లో.. 'రిక్వెస్ట్ ఎకౌంట్ డిలీషన్' అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే.. ఇక మీ ఫేస్‌బుక్ ఖాతా శాశ్వతంగా తొలగించివేయబడుతుంది.

గమనిక: ఫేస్‌బుక్ ఖాతాలో డిలీట్ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ.. ఖాతాను తిరిగి పొందడానికి, డిలీషన్ ప్రాసెస్ నిలిపివేయడానికి కొద్దిరోజుల పాటు అవకాశం ఉంటుంది. గరిష్టంగా 90రోజుల వరకు.. అంటే, మీ ఖాతా నుంచి పూర్తి సమాచారాన్ని తొలగించేలోగా.. మీరు డిలీషన్ ప్రాసెస్ నిలిపివేసి మళ్లీ ఖాతాను ఎప్పటిలాగే ఉపయోగించుకోవచ్చు.

English summary
People are furious, and they have good reason to be: Data from over 50 million Facebook users was used to target voters and influence the 2016 US presidential election, as well as the 2016 "Brexit" referendum, reports revealed over the weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X