వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్‌న్యూస్: ఆర్టీ పీసీఆర్ రూల్ ఎత్తివేసిన ఢిల్లీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రిలీఫ్

|
Google Oneindia TeluguNews

డిల్లీ సర్కార్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు అందజేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలనే నిబంధనను ఎత్తేసింది. దీనికి సంబంధించి సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే అమలుకావాలని ఆదేశాల ఇచ్చింది. దీని గురించి ట్వీట్ చేసిన స్పైస్ జెట్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారు ఆర్టీపీసీఆర్ టెస్టు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.

ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మే 6వ తేదీన ఢిల్లీకి వచ్చే తెలుగు రాష్ట్ర ప్రయాణికులు.. 14రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలని ఆర్డర్ చేసింది. ఎయిర్ లైన్స్, ట్రైన్స్ లేదా వేరే ఏదైనా ట్రాన్స్ పోర్టేషన్ ద్వారా ప్రయాణించినా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కావాలి లేదా 72 గంటలకు ముందే ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకుని నెగెటివ్ రిపోర్టుతో ఉండాలని చెప్పింది.

delhi ends rt pcr rule for passengers from telugu states

స్పైస్ జెట్ చేసిన ట్వీట్ తో పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేసింది. 'ఢిల్లీకి వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దేశ రాజధాని ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఇది అమల్లోకి వస్తుంది' అని పోస్టు చేసింది.

ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

English summary
delhi ends rt pcr rule for passengers from telangana and andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X