• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాపై విరుచుకుపడుతోన్న డెల్టా వేరియంట్: కొత్త కేసుల విస్ఫోటం: 83 శాతం పెరుగుదల

|

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా.. మరోసారి కరోనా వైరస్ బారిన పడుతోంది. ఈ సారి డెల్టా వేరియంట్ రకానికి చెందిన వైరస్ పెను ప్రభావాన్ని చూపుతోంది. డెల్టా వేరియంట్ వైరస్ వల్ల కొత్త కేసులు భారీగా పుట్టుకొస్తోన్నాయి. వారం రోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతోన్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది. ఈ వేరియంట్ వల్ల 83 శాతం మేర కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.

అమెరికాలో థర్డ్‌వేవ్?: బిడెన్ ఇంట్లో తిష్టవేసిన కరోనా: వైట్‌హౌస్ అధికారి..స్పీకర్ సిబ్బందికీఅమెరికాలో థర్డ్‌వేవ్?: బిడెన్ ఇంట్లో తిష్టవేసిన కరోనా: వైట్‌హౌస్ అధికారి..స్పీకర్ సిబ్బందికీ

 వారంరోజుల్లో భారీ పెరుగుదల..

వారంరోజుల్లో భారీ పెరుగుదల..

ఈ మేరకు ఓ నివేదికను కోవిడ్ సెనెట్ కమిటీకి అందజేసింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో- అమెరికాలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. ఈ మహమ్మారి దెబ్బకు తీవ్రంగా అమెరికా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. అత్యధిక మరణాలు, పాజిటివ్ కేసులు రికార్డయింది ఇక్కడే. పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర కోట్లను దాటిపోయింది. 3,50,81,719లకు చేరింది. ఇప్పటిదాకా 6,25,363 మంది మరణించారు.

డెల్టా వేరియంట్ వల్లే..

డెల్టా వేరియంట్ వల్లే..

కొద్దిరోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం కలవరపరుస్తోంది. దీనికి కారణం- డెల్టా వేరియంటేనని సీడీసీ డైరెక్టర్ రెఛెల్లె వెల్సింకీ తెలిపారు. సెనెట్ కమిటీకి అందజేసిన నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించారు. అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసులు అధికంగా నమోదవుతోన్నాయని, అర్కాన్సస్, ఫ్లోరిడా, మిస్సౌరీల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్నట్లు సీడీసీ డైరెక్టర్ చెప్పారు. వాటితో పాటు అలబామా, జార్జియా, లూసియానా, మిస్సిస్సిపి, టెన్నెస్సె, టెక్సాస్‌లల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొని ఉన్నట్లు పేర్కొన్నారు.

 3వ తేదీ నుంచి రెట్టింపు..

3వ తేదీ నుంచి రెట్టింపు..

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అనుసరిస్తోన్న కరోనా నివారణ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా మరణాలు కూడా 48 శాతం పెరిగాయని అన్నారు. జులై 3వ తేదీ నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల నెలకొందని, ఇది అంచనాలకు అందట్లేదని వెల్సింకీ అన్నారు. ఇంకా దేశ జనాభాలో సగం మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

  Covid-19 Third Wave లో భారత్ లో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం - ICMR | Oneindia Telugu
   ఫోర్త్‌వేవ్‌కూ

  ఫోర్త్‌వేవ్‌కూ

  వ్యాక్సినేషన్ రేషియో తక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు నమోదువుతోన్నాయని స్పష్టం చేశారు. కిందటివారంతో పోల్చుకుంటే కొత్త కేసుల పెరుగుదల 145 శాతం మేర పెరిగందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయని అన్నారు. ఈ తరహా పరిస్థితులు ఫోర్త్‌వేవ్‌కు కూడా దారి తీయొచ్చని మిస్సిస్సిపీ స్టేట్ హెల్త్ ఆఫీసర్ థామస్ డాబ్స్ హెచ్చరించారు. తక్షణమే కరోనా వైరస్ వ్యాప్తి చెందే పరిస్థితులను నివారించడానికి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని, లేదంటే మరోసారి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం లేకపోలేదని అన్నారు.

  English summary
  That’s a massive increase from a week ago, when Delta was seen as responsible for just more than half of new cases, CDC Director Rochelle Walensky, MD, told a Senate committee.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X