విమానం ఆలస్యం: ప్రయాణికుల కోసం పిజ్జా ఆర్డర్ చేశారు(ఫొటోలు)
ఫిలిడెల్ఫియా: అమెరికాలో ఓ విమాన పైలట్ తన తెలివిని ప్రదర్శించి ప్రయాణికుల మనసును గెల్చుకున్నాడు. ప్రయాణికులతో నిండిన ఆ విమానం కొన్ని కారణాల వల్ల రన్ వేపైనే కాసేపు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పైలట్ తన ఆలోచనతో వారిని శాంతింపజేశాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో రన్ వేపై ప్రయాణికులతో కూడిన విమానం కాసేపు ఆగిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులందరూ ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పైలట్ సమయస్ఫూర్తితో ప్రయాణికులందరికీ పిజ్జా ఆర్డర్ చేశాడు. ఇంకేముంది శాంతించిన ప్రయాణికులు చేతిలోకి వచ్చిన పిజ్జాలను ఆనందంగా ఆరగించారు.

ఫిలడెల్పియా నుంచి అట్లాంటా వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం తుఫాను కారణంగా నాక్స్‌విల్లే ప్రాంతానికి మళ్లించారు. అయితే తిరిగి అట్లాంటాకు వెళ్లడానికి అక్కడ విమానాశ్రయంలో విపరీతమైన రద్దీ ఉండటంతో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది.
Well my @Delta pizza party pic is going viral right now. Here's a couple more shots of our #deltapizzaparty pic.twitter.com/2T9MxLrpN7
— Riley Vasquez (@RileyVasquez) May 27, 2015
ఈ నేపథ్యంలో రన్ వేపైనే ఉన్న ఆలస్యమైన విమానంలోని ప్రయాణికుల అందరికీ డెల్టా ఎయిర్ లైన్స్ తరపున పైలట్ పిజ్జా ఆర్డర్ ఇచ్చి వారికి పార్టీ ఇచ్చాడు. దీంతో పలువురు ప్రయాణికులు డెల్టా ఎయిర్ లైన్స్ సేవలను కొనియడుతూ ట్విట్టర్‌లో సందేశాలు పోస్ట్ చేశారు.
Delta continues with class. Stuck due to weather and the crew ordered everyone pizza. #deltaairlines pic.twitter.com/yMeBCFF0qL
— Bill Wittenmyer (@BillyTheKidWitt) May 26, 2015