వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల బాంబు: అభిశంసన ప్రకటన..పదవీ గండం: క్రిస్మస్ లోగా ఓటింగ్..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పదవీ గండాన్ని ఎదుర్కోనున్నారు. అమెరికా పార్లమెంట్ లో డెమోక్రాట్లు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. దీనిపై క్రిస్మస్ లోగా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానం వీగిపోతే సరే. లేదంటే- డొనాల్డ్ ట్రంప్ పదవిని వదులుకోవాల్సి రావడం ఖాయమని తెలుస్తోంది. ఇదివరకు ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడితో బెదిరింపు ధోరణిలో మాట్లాడారనే ఆరోపణలే దీనికి ప్రధాన కారణాలు అయ్యాయి.

అభిశంసనకు కారణాలివే..

అభిశంసనకు కారణాలివే..

ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడు వొలోడిమ‌ర్ జెలెన్‌స్కీని డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లో బెదిరించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ అంశం కొంతకాలంగా అమెరికా రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోంది. నిజానికి- అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఇదివరకు ఉక్రెయిన్ లో పని చేశారు.

పోటీ లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో..

పోటీ లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో..


హంటర్ బిడెన్ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఒత్తిడిని తీసుకొచ్చారనేది ప్రధాన ఆరోపణ. తద్వారా జో బిడెన్ ను పోటీ నుంచి తప్పుకొనేలా చేయొచ్చనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఈ ఫోన్ కాల్ చేసినట్లు డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. అమెరికా ప్రతిష్ఠను దెబ్బ తీసేలా చేశారని, తన వ్యక్తిగత కక్ష సాధింపు కోసం ట్రంప్ ఏకంగా దేశ రక్షణ అంశాన్ని పణంగా పెట్టారంటూ డెమోక్రాట్లు కొంతకాలంగా ఎదురుదాడికి దిగుతున్నారు.

కొంతకాలంగా అభిశంసన ప్రక్రియ..

కొంతకాలంగా అభిశంసన ప్రక్రియ..


డొనాల్డ్ ట్రంప్‌ పై అభిశంసనను ప్రవేశ పెట్టడానికి కొంతకాలంగా డెమోక్రాట్లు తమ ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇది చివరి దశకు చేరుకుంది. అమెరికా చట్టసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టేలా చేసింది. ట్రంప్ పై అభిశంసనను ప్రవేశ పెట్టినట్లు హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్‌ నాన్సీ పెలోసి వెల్లడించారు. క్రిస్మస్ లోగా ఈ అభిశంసన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉందని నాన్సీ పెలోసి తెలిపారు.

మూడో అధ్యక్షుడిగా ట్రంప్..

మూడో అధ్యక్షుడిగా ట్రంప్..

హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ లో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న మూడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇదివరకు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్. అభిశంసనను ఎదుర్కొన్నారు. వారిద్దరూ పదవులను కోల్పోకపోవడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. మరో మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పై కూడా అభిశంసన పెట్టడానికి ప్రయత్నాలు సాగాయి. వాటికి అవకాశం ఇవ్వకుండా ఆయనే స్వచ్ఛందంగా తప్పుకొన్నారు. తన పదవికి రాజీనామా చేశారు.

అభిశంసనను లైట్ గా తీసుకున్న ట్రంప్..

ఈ అభిశంసన ప్రక్రియను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో చేసిన ఫోన్ కాల్ లో ఎలాంటి తప్పూ లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇదివరకు ప్రవేశపెట్టిన అభిశంసనలు ఏమయ్యాయో తెలుసు కదా? అని ఆయన చెప్పుకొచ్చారు. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ లో ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం.. ట్రంప్ పదవికి వచ్చిన ఇబ్బందేమీ లేదనే అంటున్నారు. డెమోక్రాట్ల కంటే అధికారంలో ఉన్న రిపబ్లికన్ల బలం అధికంగా ఉండటంతో తీర్మానం వీగిపోతుందని చెబుతున్నారు.

English summary
House Democrats have announced two articles of impeachment charging President Donald Trump with abuse of power and obstruction of Congress. Voting is expected in a matter of days in the Judiciary Committee and by Christmas in the full House.Speaker Nancy Pelosi, flanked by the chairmen of the impeachment inquiry committees, stood at the Capitol in what she called a "solemn act".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X