వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్: డెమొక్రటిక్ పార్టీకే పట్టం కట్టిన అమెరికన్లు

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై రిఫరెండంగా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి ప్రజలు జై కొట్టారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో 218 సీట్లతో డెమొక్రటిక్ పార్టీ విజయఢంకా మోగించింది. దీంతో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు కేవలం 193 స్థానాలకే పరిమితమయ్యారు. మరోవైపు సెనెట్‌లో రిపబ్లికన్ల హవా కొనసాగింది. ఎన్నికలు 35 స్థానాలకు జరుగగా 26 స్థానాల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది.

ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బగా మిగిల్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్స్ పై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, అడ్డగోలు నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయినట్లుగా తెలుస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా ఫలితాలతో ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్ పడే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై కీలక నిర్ణయాలు తీసుకోవడంలో డెమొక్రాట్ల ఆమోదం లేకుండా ట్రంప్ ముందుకెళ్లే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Democrats win House of Representatives while Republicans win majority of senate seats

అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ప్రతి రెండేళ్లకోసారి, సెనేట్‌కు ప్రతి ఆరేళ్లకు ఒక సారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల సమయానికి అధ్యక్ష పీఠంలో కూర్చు వ్యక్తి పాలనకు రిఫరెండంగా భావిస్తారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ..100 స్థానాలున్న సెనేట్‌కు 35 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.

English summary
Democrats claimed control of the House late Tuesday and picked up some governorships, but Republicans were poised to expand their majority in the Senate, delivering a split verdict in the first national referendum on Donald Trump's presidency.The most expensive and consequential midterm elections in modern times came to a dramatic finish that underscored the nation's deep polarization, but fell short of delivering a sweeping repudiation of Trump that Democrats had hoped would put an exclamation point on the "resistance" movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X