వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కుక్క కరిచిందని కాల్పులు జరిపితే యువకుడు చనిపోయాడు

పోలీసు అధికారిని కుక్కపిల్ల కరిచిందని ఇద్దరు పోలీస్ అధికారులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో అదే దారిన వెళ్ళే అర్మాండో గార్సికా అనే యువకుడికి బుల్లెట్ గాయాలై చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లాస్ ఎంజెలిస్: పోలీసు అధికారిని కుక్కపిల్ల కరిచిందని ఇద్దరు పోలీస్ అధికారులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో అదే దారిన వెళ్ళే అర్మాండో గార్సికా అనే యువకుడికి బుల్లెట్ గాయాలై చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకొంది. ఈ ఘటన అమెరికాలో కాలిఫోర్నియాలోని ఫామ్ డెల్లో లో చోటుచేసుకొంది.

కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో అధిక శబ్దాలతో మ్యూజిక్ సిస్టమ్ పెట్టి చుట్టుపక్కల ఇళ్లవారికి ఇబ్బందికల్గిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Deputies Fatally Shoot Teen in Palmdale While Trying to Stop Dog From Charging at Them
ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్ళి విచారణ చేపట్టారు పోలీసులు. ఇంతలో మూడేళ్ళ ఓ కుక్కపిల్ల ఓ పోలిసుపై దాడిచేసి మోకాలుపై కరిచింది. దీంతో గాయపడ్డ ఓ పోలీసు గట్టిగా అరిచాడు.

ఇంతలోనే కుక్కపిల్ల ఆ ఇంటి నుండి వీధుల్లోకి పరుగులు తీసింది. విచారణకు వస్తే మా పైనే కుక్కను వదులుతారా అంటూ కుక్కపిల్లపై పోలీసులు కాల్పులు జరిపారు.

సరిగ్గా అదే సమయంలో అదే దారిలో వెళ్తున్న 17 ఏళ్ళ యువకుడు ఆర్మాండో గార్సికా మూరో ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్ళాయి. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

అర్మాండో ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సహోద్యోగిని కరిచిపోతోందన్న ఆవేశంలో ఇద్దరు పోలీసులు దాదాపు ఆరు రౌండ్ల కుక్కుపిల్లపై కాల్పులు జరిపారు. దురదృష్టవశాత్తూ ఆ దారిలో వెళ్తున్న అనే యువకుడు చనిపోయాడు.

విచారణకు వెళ్ళిన సమయంలో ఐదుగురు పోలీసులున్నారు. కానీ, ఇద్దరు పోలీసుల చర్యతో ఈ విషాదం చోటుచేసుకొందన్నారు. మరో వైపు తన ఇంటికి ఎంతోమంది పిల్లలు, పెద్దలు వస్తుంటారు. వారికిష్టం వచ్చిన మ్యూజిక్ సిస్టమ్స్ తో పాటలు వింటారు. ఇందులో తప్పేముందని ఇంటి యజమాని ప్రశ్నించారు. అయితే పోలీసుపై దాడి చేసిన కుక్క తనది కాదన్నారు.

English summary
In what officials called an "extremely unfortunate incident," a teenager was shot and killed in Palmdale by sheriff's deputies who had opened fire on a pitbull that was charging at them a second time early Thursday, according to the Los Angeles County Sheriff's Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X