వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహమ్మారి, మాంద్యం ఉన్నా ఒక కంపెనీ షేర్లు కొని వీళ్లంతా కోటీశ్వరులు అయిపోయారు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టెస్లా కారు

టెస్లా షేర్ల ధరలు పెరగడంతో 2020లో చాలా మంది కోటీశ్వరులు అయ్యారు

వారంతా తమను మిలియనీర్లు, బిలియనీర్లు అని కాకుండా, టెస్లానీయర్లుగా చెప్పుకుంటున్నారు.

పారిశ్రామిక దిగ్గడం ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా షేర్ల ధరలు 2020 సంవత్సరంలో 700 శాతానికి పైగా పెరిగాయి.

దీంతో అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీగా మారింది.

కానీ, ఈ కంపెనీలో దశాబ్దం క్రితం డబ్బులు పెట్టిన పెట్టుబడిదారులకు మాత్రం అది ఒక ఒడిదొడుకుల ప్రయాణంగా నిలిచింది.

అమెరికా అతిపెద్ద స్టాక్ ఇండెక్స్‌లో టాప్‌ టెన్ కంపెనీ

ఆ సమయంలో ఎవరైతే టెస్లా మీద నమ్మకం ఉంచి, దాని వెంటే నిలిచారో, వారందరికీ అది ఇప్పుడు చాలా లాభసాటి ఒప్పందంగా నిరూపితమైంది.

టెస్లా గత ఏడాది డిసెంబర్‌లో ఎస్ & పీ-500లో భాగమైంది. ఇది అమెరికాలోనే అతిపెద్ద స్టాక్ ఇండెక్స్.

యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ లాంటి కంపెనీలు ఇందులో భాగంగా ఉన్నాయి.

డిసెంబర్‌లో టెస్లా షేర్లు అద్భుతమైన లాభాలను కళ్లజూశాయి. దాంతో, అది ఏకంగా ఇండెక్స్‌లోని టాప్ టెన్ కంపెనీల్లో చేరిపోయింది.

ఇప్పుడు జనరల్ మోటార్స్, ఫోర్డ్, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, టయోటా మొత్తం షేర్ల ధర కంటే టెస్లా స్టాక్ ధర ఎక్కువగా ఉంది.

టెస్లా కారు

ఎలక్ట్రిక్ కార్ల దిశగా పెరిగిన ట్రెండ్

అయినా, ఇక్కడ మనకు ఒకటి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తన ప్రత్యర్థి కంపెనీల మొత్తం కార్ల ఉత్పత్తితో పోలిస్తే, టెస్లాలో కార్ల ఉత్పత్తి ఒక చిన్న భాగం మాత్రమే.

"మొదట్లోనే దీనిలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, వారంతా చాలా లాభపడ్డారు. కొంతమంది ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు" అని పెట్టుబడుల కంపెనీ గ్రానైట్ షేర్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీల్ రాయిండ్ చెప్పారు.

చైనాలో టెస్లా కార్లకు డిమాండ్ బాగా పెరగడం కూడా దీని షేర్ల ధరలు పెరగడానికి ఒక పెద్ద కారణంగా నిలిచింది.

ఇది కాకుండా ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ ఉంటుందనే ఆశలు కూడా టెస్లా షేర్ల ధరల పెరుగుదలకు ఒక కారణం అయ్యాయి. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ కార్ల వైపు పెరుగుతున్న ఆసక్తి టెస్లా లాంటి కంపెనీలను ఒక ముఖ్యమైన స్థితిలో నిలిపాయి.

టెస్లాకు సంబంధించిన మిగతా వ్యాపారాల్లో కూడా బలమైన వృద్ధి ఉంటుందని చాలామంది పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈ వ్యాపారాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్, బ్యాటరీ, పవర్‌ స్టోరేజ్ లాంటివి ఉన్నాయి.

టెస్లా

షేర్ల ధరలు అతిగా పెరిగాయా?

2010 జూన్‌లో ఒక షేర్ ధర 17 డాలర్ల చొప్పున టెస్లా షేర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు దాని ధర 650 డాలర్ల కంటే ఎక్కువే ఉంది.

కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ 2020లో టెస్లా షేర్ల ధరలు పెరగడం గురించి మాట్లాడుతున్న విమర్శకులు ఆ కంపెనీని చాలా ఎక్కువగా అంచనా వేస్తున్నారని చెబుతున్నారు.

"టెస్లా షేర్లను మాకు తెలిసి, అన్ని సంప్రదాయ ప్రమాణాల ప్రకారం ఎక్కువగా అంచనా వేయడమే కాదు, వాటి ధరలు నాటకీయంగా పెరుగుతున్నాయి" అని డిసెంబర్ మొదట్లో ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ విశ్లేషకులు చెప్పారు.

కానీ, టెస్లాను ఒక కార్ల కంపెనీగా మాత్రమ చూడకూడదని మరికొందరు పెట్టుబడి నిపుణులు చెబుతున్నారు.

"చాలా మంది పెట్టుబడిదారుల్లో టెస్లా గురించి ఆసక్తి ఉంది. అది ఒక కారు కంపెనీ అనే కాదు, అది కారు కంపెనీ కంటే చాలా ఎక్కువ. విజయవంతం అయిన దాని బ్యాటరీలు, ఎన్నో ఆదాయ వనరులకు తలుపులు తెరిచాయి" అని పెట్టుబడుల కంపెనీ ఓఆండాలోని సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఎడ్వర్డ్ మోయా అన్నారు.

"శిలాజ ఇంధనం నుంచి ఎలక్ట్రిక్ పవర్, నిల్వను సృష్టించడంలో టెస్లా పాత్ర గురించి ఆలోచించండి. ఆ కోణంలో చూస్తే, భవిష్యత్తులో టెక్నాలజీని ఎలా అంచనా వేయాలి అనేది పెట్టుబడిదారుల ముందున్న అతి పెద్ద ప్రశ్న అని మనం చెప్పవచ్చు" అని రాయిండ్ అన్నారు.

టెస్లా గృహ అవసరాల కోసం సోలార్ ప్యానళ్లు, బ్యాకప్ పవర్ కూడా తయారుచేస్తోంది.

టెస్లా షేర్లతో కోటీశ్వరులైన వారి కథ

టెస్లా ఉజ్వల భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉన్న పెట్టుబడిదారులు చాలా మందే ఉన్నారు.

లాస్ ఏంజిల్స్ ఇంజనీర్ జాసన్ డీ-బోల్ట్ టెస్లాలో మొదటిసారి పెట్టుబడి పెట్టినపుడు, 19 వేల డాలర్లు పెట్టి 2500 షేర్లు కొన్నారు.

"నేను మొదటిసారి 2013లో టెస్లా మోడల్-S కొని, ఆ ఫ్యాక్టరీలో పర్యటించిన తర్వాత, ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాను" అని ఆయన చెప్పారు.

అప్పటి నుంచి జాసన్ ఆ షేర్లు కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర టెస్లాకు చెందిన 15 వేల షేర్లు ఉన్నాయి. వాటి ధర ఇప్పుడు దాదాపు ఒక కోటి డాలర్లు.

దీర్ఘకాలిక పెట్టుబడిదారుడుగా తన ప్రయాణం ఎన్నో ఒడిదొడుకులతో సాగిందనే విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు.

''ఎలాన్ మస్క్, టెస్లాపై మీడియాలో ఎప్పుడూ దాడి జరగడం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించేది. అది, నా షేర్ల ధరలు పతనం కావడం కంటే ఘోరంగా ఉండేది. చివరికి వాటన్నిటికీ సమాధానం దొరుకుతుందనే విషయం నాకు తెలుసు" అంటారు జాసన్.

షేర్‌హోల్డర్స్ క్లబ్‌లో జాసన్ డీ-బోల్ట్ సభ్యులు. ఆయన ఎప్పుడూ ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా మిగతా పెట్టుబడిదారులతో మాట్లాడుతూ ఉంటారు.

న్యూయార్క్‌లోని స్కాట్ టిస్డేల్ 2013లో మోడల్-S చూసిన తర్వాత టెస్లాలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఆయన దగ్గర మొత్తం 4 వేల టెస్లా షేర్లు ఉన్నాయి. వాటి ధర ఇప్పుడు 28 లక్షల డాలర్లు.

"నేను దీనిలో పెట్టుబడులు పెట్టడం ఆపేయలేదు. దీని, అసలైన విజయగాధ ఇప్పుడే మొదలవబోతోంది. ఎప్పుడైతే జనం దీని షేర్ పెరుగుతుంది అని చెప్పారో, అప్పటి నుంచే నేను వీటిని కొనడం ప్రారంభించాను" అన్నారు టిస్డేల్.

ముందున్న సవాళ్లు ఏమిటి

2021లో టెస్లా షేర్ల ధరలు మళ్లీ 700 శాతం పెరుగుతాయని, దాని వల్ల టెస్లా షేర్ హోల్డర్లు కోటీశ్వరులు అవుతారని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. యాపిల్ లాంటి కంపెనీల నుంచి టెస్లాకు సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

యాపిల్ తన చైనా ప్రత్యర్థుల సహకారంతో ఎలక్ట్రిక్ కార్ తయారు చేసే ప్రణాళికను మళ్లీ ప్రారంభించే యోచనలో ఉంది.

"టెస్లా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అది దానికోసం చాలా పెద్ద రిస్క్ తీసుకోవచ్చు" అని ఓయాండాలోని మోయా అన్నారు.

టెస్లా కంపెనీలో మాత్రమే పెట్టుబడులు పెట్టడం గురించి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ప్రాంతంలో మీ డబ్బు పెట్టాలని వారంతా సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Despite the epidemic and the recession, These people bought shares from one company became billionaires
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X