• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ లక్షణాలు ఉన్నా కరోనా వచ్చే అవకాశం ... సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ స్టడీ

|

చైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో కుదేలయింది . ఇక ఈ దేశం, ఆ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా నియంత్రణకు ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించింది . ఇక ఈ క్రమంలో ఇప్పటి వరకు మెడిసిన లేని కరోనాను అరికట్టటం ఎలా అని పరిశోధనలు చేస్తున్నారు వైరాలజీ నిపుణులు , అలాగే వైద్య శాస్త్ర నిపుణులు . ఇక ఇది ఇలా ఉంటె కరోనా లక్షణాల విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

 కరోనా అప్డేట్ .. భారత్ లో 33వేలు దాటిన కరోనా కేసులు.. టాప్ 10 లో ఉన్న రాష్ట్రాలివే !! కరోనా అప్డేట్ .. భారత్ లో 33వేలు దాటిన కరోనా కేసులు.. టాప్ 10 లో ఉన్న రాష్ట్రాలివే !!

 మరి కొన్ని లక్షణాలతో కూడా కరోనా ... తాజా అధ్యయనం

మరి కొన్ని లక్షణాలతో కూడా కరోనా ... తాజా అధ్యయనం

కరోనా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంది. కొన్ని కేసుల్లో అసలు లక్షణాలే కనిపించటం లేదని కూడా పరిశోధనలో తేలింది. ప్రాధమికంగా నిర్ధారించిన లక్షణాలతో పాటు తాజాగా మరి కొన్ని లక్షణాలు కూడా వచ్చి చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబును మాత్ర‌మే ప్రాధమిక క‌రోనా ల‌క్ష‌ణాలుగా గుర్తించారు . కానీ ఇప్పుడు కరోనా తన రూటు మార్చింది. మ‌రిన్ని ల‌క్ష‌ణాల‌తో విరుచుకుప‌డుతోంది. ఇక ఊహించని ఈ లక్షణాలు కూడా కరోనా కారకాలని ఒక అధ్యయనం లో తేలింది.

మరో ఆరు లక్షణాలు కరోనా లక్షణాలుగా గుర్తించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్య‌య‌నం

మరో ఆరు లక్షణాలు కరోనా లక్షణాలుగా గుర్తించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్య‌య‌నం

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్య‌య‌నం ప్రకారం వాస‌న గ్ర‌హించే శ‌క్తిని కోల్పోవ‌డం, రుచిని గుర్తించలేకపోవటం, తలనొప్పిగా ఉండటం కండ‌రాల నొప్పి, చ‌లి, వ‌ణ‌కడం, విపరీతమైన గొంతు నొప్పి వంటి వాటిని క‌రోనా ల‌క్ష‌ణాల జాబితాలో చేర్చారు . కోవిడ్‌-19 బారిన ప‌డిన 2వ రోజు నుంచి 14 రోజుల మ‌ధ్య‌లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించే ఆస్కారం ఉంద‌ని తాజా అధ్యయనంలో సీడీసి హెచ్చ‌రించింది. దీంతో క‌రోనా ల‌క్ష‌ణాల సంఖ్య తొమ్మిదికి చేరింది.

చలి, రుచిని , వాసనను గ్రహించే శక్తి కోల్పోవటం కూడా కరోనా లక్షణాలే

చలి, రుచిని , వాసనను గ్రహించే శక్తి కోల్పోవటం కూడా కరోనా లక్షణాలే

ఇక బాగా చలిగా అనిపించినా , గొంతు నొప్పిగా ఉన్నా, రుచి వాసన తెలియని పరిస్థితి ఉన్నా కరోనా టెస్ట్ చేయించుకోవటం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇక బ్రిట‌న్‌లో క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల్లో చాలామందికి రుచిని , వాసనను గ్రహించే శక్తి కోల్పోవటం జరిగిందని ఇది కరోనా లక్షణం అని అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఇక చలి ఒక లక్షణం అని చెప్తున్న సమయంలో మండుటెండలో చలిగా ఉందని అన్నారంటే వారికి కరోనా పరీక్షలు చేయిస్తే మంచిదని అధ్యయనం తేల్చి చెప్పింది . ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి కార‌ణం లేకుండానే చ‌లితో వ‌ణ‌కడం కూడా కోవిడ్ ప్ర‌ధాన ల‌క్షణం అని పేర్కొంది .

కండరాల నొప్పి , తలనొప్పి , గొంతు నొప్పితోనూ కరోనా

కండరాల నొప్పి , తలనొప్పి , గొంతు నొప్పితోనూ కరోనా


ఇక ఇదే సమయంలో అమెరికాలో సుమారు 14 శాతానికి పైగా క‌రోనా బాధితుల్లో విపరీతమైన కండరాల్ నొప్పులు ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా వ‌య‌సు పైబ‌డిన వారిని కండ‌రాల నొప్పి వేధిస్తోంది. క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉన్న కేసుల్లో ఈ ల‌క్ష‌ణం కూడా వెలుగులోకి వచ్చింది . జ‌లుబు ఉన్న‌ప్పుడు త‌లనొప్పి రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే త‌ల తిరుగుతున్న‌ట్లు అనిపించినా, త‌లంతా నొప్పిగా అనిపించినా కూడా అది కరోనా లక్షణంగా పరిగణించాలని అంటున్నారు. తాజాగా న‌మోద‌వుతున్న కేసుల్లో త‌ల‌నొప్పి కూడా క‌నిపిస్తోంద‌ని అధ్య‌య‌నం పేర్కొంది. ఇక కరోనా వైరస్ ప్రభావం ఉన్న కేసుల్లో 60 శాతానికి పైగా కేసులు ద‌గ్గు, గొంతు నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇందులో ఏ ఒక్క ల‌క్ష‌ణం క‌నిపించినా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల్సిందేన‌ని చెబుతున్నారు. కరోనా పరీక్షలు తప్పనిసరి అంటున్నారు .

English summary
According to the Center for Disease Control and Prevention (CDC) study, coronal symptoms include loss of sense of smell, loss of taste, headache, muscle pain, chills, tremors, and severe sore throat. The latest study, cdc, has warned that these symptoms are likely to occur between 2 and 14 days after being infected with covid-19. This has increased the number of corona symptoms to nine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X