వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవయాని ఇష్యూలో ట్విస్ట్: ఐరాస గుర్తింపు, దౌత్యరక్షణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: దౌత్యకారిణి దేవయాని అంశంలో మరో కొత్త మలుపు. డిసెంబర్ 12వ తేదీన దేవయానిని అరెస్టు చేసిన సమయంలో ఆమెకు వ్యక్తిగత అరెస్టు, నిర్బంధం నుండి మినహాయింపును కల్పిస్తూ అప్పటికే పూర్తిస్థాయిలో దౌత్యపరమైన రక్షణ ఉంది. వీసా వ్యవహారంలో మోసానికి పాల్పడిందన్న ఆరోపణలతో అమెరికా పోలీసులు ఈ నెల 12వ తేదీన న్యూయార్క్‌లో దేవయానిని బహిరంగంగా అరెస్టు చేసి దారుణంగా అవమానించిన విషయం తెలిసిందే.

అయితే దేవయానికి వ్యక్తిగత అరెస్టు, నిర్బంధం నుంచి మినహాయింపును కల్పిస్తూ అప్పటికే పూర్తిస్థాయిలో దౌత్యపరమైన రక్షణ ఉన్నప్పటికీ అమెరికా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లో భారత డిప్యుటీ కాన్సల్ జనరల్‌గా నియమితురాలైన దేవయాని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత రాయబార కార్యాలయ సలహాదారుగా గుర్తింపును కలిగి ఉన్నారు.

Devyani

ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఆగస్టు 26వ తేదీన కల్పించిన ఈ గుర్తింపు ఈ నెలాఖరు వరకు (డిసెంబర్) చెల్లుబాటు అవుతుంది. ఐక్యరాజ్య సమితి హక్కులు, రక్షణలకు సంబంధించిన నిబంధనావళి ఆర్టికల్ 4లోని 11ఎ సెక్షన్ ప్రకారం సమితి సభ్యుల ప్రతినిధులను వ్యక్తిగతంగా అరెస్టు చేసేందుకుగానీ, వారి సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు గానీ వీలుండదు.

ప్రతినిధి అనే పదాన్ని ఈ ఆర్టికల్ సవివరంగా నిర్వచిస్తోంది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ఉప ప్రతినిధులతో పాటు సలహాదారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధి బృందాల కార్యదర్శులను కూడా సమితి ప్రతినిధులుగానే పరిగణించడం జరుగుతుందని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తోంది. కనుక ఈ నెల 12వ తేదీన దేవయాని అరెస్టు ఆమె హోదాకు విరుద్ధంగా జరిగిందంటున్నారు. ఈ విషయాన్ని భారత్ అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకు వెళ్లింది.

English summary
India has informed the US that Devyani Khobragade was 
 
 accredited to the UN as a member of the country's 
 
 delegation to the General Assembly before her arrest 
 
 in a visa fraud case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X