వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్యా.. కరోనాకు డెక్సామెథాసోన్, తక్కువ ధరకు డ్రగ్, పేదలకు మేలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ కనుగొనడంలో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. తక్కువ ధరలో లభించే డ్రగ్ వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం ఉంటుంది. తక్కువ మోతాదులో స్టెరాయిడ్ ఇవ్వడం డ్రగ్ ప్లస్ పాయింట్ అని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ కోసం డెక్సామెథాసోన్ డ్రగ్ పనిచేస్తుందని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్ రోగులను ఇప్పటికే పరీక్షిస్తున్నారు. డ్రగ్ వెంటిలేటర్‌పై ఉన్న రోగుల మరణాన్ని మూడో వంతు తగ్గించింది. ఆక్సిజన్ ఉన్నవారికి ఐదో వంతు తగ్గించింది. వైరస్ ఆవిర్భవించిన తొలినాళ్ల నుంచి డ్రగ్ వాడితే ఇప్పటివరకు 5 వేల మందిని బతికించేవారమని నిపుణులు చెబుతున్నారు.

 Dexamethasone proves first life-saving drug..

ఈ డ్రగ్ పేద దేశాల్లో ఎక్కువ రోగులు ఉంటే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే బ్రిటన్‌లో 2 లక్షల డ్రగ్ నిల్వ ఉంది. రోగులకు డ్రగ్ అందుబాటులో ఉంచి.. అందజేస్తుంది. వైరస్ కోసం డ్రగ్ పనిచేయడంపై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక డ్రగ్ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. బ్రిటనే కాదు.. ప్రపంచంలో ఉన్న మిగతా వారిని కూడా డ్రగ్ కాపాడుతోందని ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి తెలిపారు.

వైరస్ ఉన్న 20 మంది రోగులల్లో 19 మంది ఆస్పత్రిలో చేరకుండానే కోలుకుంటున్నారని తెలిపారు. చాలా మంది వెంటనే కోలుకుంటున్నారని.. అయితే కొందరికి ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం ఏర్పడొచ్చు అని పేర్కొన్నారు. వైరస్ పీక్ స్టేజ్‌లో ఉన్నవారికి డ్రగ్ ఉపయోగపడుతోందని చెప్పారు. అర్ధరైటిస్, ఉబ్బసం, చర్మ వ్యాధులకు కూడా డ్రగ్ యూజ్ చేయొచ్చని తెలిపారు.

English summary
The low-dose steroid treatment dexamethasone is a major breakthrough in the fight against the deadly virus, UK experts say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X