వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తరుషి కోసం అతను ప్రాణత్యాగం చేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఢాకా: స్నేహితురాళ్ల కోసం ఢాకా ఉగ్రదాడిలో ఓ యువకుడు ప్రాణత్యాగం చేశాడు. వెళ్లిపోవాలని ఉగ్రవాదులు చెప్పినా వినకుండా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్ల కోసం అక్కడే ఉండిపోయి బంగ్లాదేశ్ యువకుడు ప్రాణాలు బలిపెట్టాడు. 20 ఏళ్ల ఫరాజ్ అయాజ్ హొస్సైన్ అనే బంగ్లాదే్ విద్యార్థి ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

ఆ విద్యార్థిని సోషల్ మీడియాలో హీరోగా ప్రశంసిస్తున్నారు. తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్లను వదిలేసి వెళ్లడానికి ఫరాజ్‌ నిరాకరించాడు. అతను అక్కడే ఉన్నాడని ఇటీవల ఢాకాలోని రెస్టారెంట్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి మీడియాకు చెప్పారు.

Dhaka attack: Faraaz lost his life for friends

ఫరాజ్‌ స్నేహితురాళ్లలో భారతీయ యువతి తరుషి కూడా ఉంది. ఫరాజ్‌ అమెరికాలోని ఎమ్రోయ్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. వేసవి సెలవులకు అతడు బంగ్లాదేశ్‌ వచ్చాడు. సెలవులకు వచ్చిన తన స్నేహితురాళ్లు ఎమ్రోయ్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న అమెరికాకు చెందిన అబింతా కబిర్‌, కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని తరుషి జైన్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు.

ఆ రెస్టారెంట్‌లో ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నవారిలో ఈ ముగ్గురు కూడాఉన్నారు. ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌ వారిని వదిలేసి, విదేశీయులను మాత్రమే చంపేశారు. అయితే వెళ్లిపోవాలని ఫరాజ్‌కు ఉగ్రవాదులు చెప్పారు. అయితే తన స్నేహితురాళ్లను వదిలేస్తే వెళ్తానని, లేదంటే వెళ్లనని చెప్పడంతో ఉగ్రవాదులు అతడిని కూడా హతమార్చారు.

Dhaka attack: Faraaz lost his life for friends

ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు రెస్టారెంట్‌పై దాడి చేసి 20 మందిని చంపిన విషయం తెలిసిందే. భద్రతాసిబ్బంది దాడుల్లో ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

English summary
A Bangladeshi student Faraaz Hossain lost his life in the hands of terrorist in Dhaka restaurant for the sake of his friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X