వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేఫ్‌లో జొరబడి 18 విదేశీయులను చంపిన ఘటన నిందితుడి హతం

ఢాకా కేఫ్ పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నురుల్ ఇస్లాం అలియాస్ మర్జాన్ అలియాస్ షకీల్ శుక్రవారం ఉదయం హతమయ్యాడు. నాటి పేలుళ్లకు ఇతను మాస్టర్ మైండ్‌గా భావిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

ఢాకా: గత ఏడాది జూలై నెలలో ఢాకా కేఫ్ పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న నురుల్ ఇస్లాం అలియాస్ మర్జాన్ అలియాస్ షకీల్ శుక్రవారం ఉదయం హతమయ్యాడు. నాటి పేలుళ్లకు ఇతను మాస్టర్ మైండ్‌గా భావిస్తున్నారు. ఇతని వయస్సు 22 ఏళ్లు.

ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు జరిపిన దాడుల్లో మర్జాన్‌, మరో అనుమానిత తీవ్రవాది హతమైనట్లు పోలీసులు చెప్పారు. తీవ్రవాదుల కదలికలపై తమకు అందిన సమాచారం మేరకు ఢాకాలోని రేయర్‌ బజార్‌ పరిసరాల్లో దాడులు జరిపారు.

Dhaka attack mastermind was the youngest IS-JMB commander at 22

అనంతరం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. వారు కాల్పుల్లో మరణించారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్నది స్పష్టం చేయాల్సి ఉంది. మర్జాన్ ఢాకా దాడి కుట్రదారుల్లో ఒకడని పోలీసులు తెలిపారు.

2016 జులై 1న కొందరు ఉగ్రవాదులు ఢాకాలోని హోలీ ఆర్టిసాన్‌ బేకరీలో చొరబడి పద్దెనిమిది మంది విదీశీయులను బందీలుగా తీసుకుని చంపేశారు.

Dhaka attack mastermind was the youngest IS-JMB commander at 22

ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించింది. దాడికి సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. కానీ బంగ్లా పోలీసులు ఖండించారు. బంగ్లాదేశ్‌కే చెందిన జమాతె ముజాహిదీన్‌ (జేఎం) బంగ్లాదేశ్‌ అనే ఉగ్ర సంస్థ ఈ దాడి చేసిందన్నారు.

English summary
Nurul Islam alias Marjan alias Shakil, the mastermind of the July 2016 Dhaka Cafe attack was killed early Friday morning. He is believed to be the man who coordinated and masterminded the attack. The rise of the 22-year-old operative who was originally part of the Islami Chhatra Shibir was phenomenal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X