• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భవిష్యవాణి: పన్డేవా చెప్పిన జోస్యం నిజమవుతుందా?

By Nageswara Rao
|

యూరప్‌ను 2016లో ముస్లింలు ఆక్రమించుకుంటారని, 2018 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి చైనా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని బల్గేరియా మహిళ బాబా వాంగ పన్డేవా తాజాగా చెప్పిన జోస్యాలివి. ఈ ఏడాదికి ఆమె చెప్పిన జోస్యంపై మళ్లీ ఆమె పేరు వార్తల్లోకి వచ్చింది.

‘‘2016లో యూర్‌పపై ముస్లింలు దాడి చేస్తారు. ఇది యుద్ధానికి దారి తీసి యూర్‌పలోని జనమంతా మృత్యువాత పడతారు'' అని వాంగ పన్డేవా 1996కు ముందే చెప్పారు. సిరియాలో ‘గ్రేట్‌ ఇస్లామిక్‌ వార్‌' మొదలై 2043 నాటికి రోమ్‌పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని ఆమె చెప్పారు.

ఇంతకీ ఎవరీ బాబా వాంగ పన్డేవా. బల్గేరియాలోని పెట్రిచ్‌ నగరంలో 1911, జనవరి 31న పన్డేవా జన్మించారు. 1996 ఆగస్టు 11న మరణించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయినా, ప్రాణాలతో బయటపడ్డారు. కళ్లలో ఇసుక పడటంతో ఆమె చూపుని కోల్పోయారు. తన 16వ ఏట నుంచే భవిష్యవాణి మొదలుపెట్టారు.

తండ్రి పెంచుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఉన్న చోటును వివరాలతో సహా ఊహించి చెప్పడంతో ఆమె జోస్యం ప్రారంభమైంది. దీంతో 30 ఏళ్లు వచ్చేసరికి ఆమె అతీంద్రియ శక్తులు మరింత బలోపేతం అయ్యాయని బల్గేరియా వాసులు నమ్ముతున్నారు.

ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం కావడంతో ఆమెను ‘నోస్ట్రడామస్‌ ఆఫ్‌ ద బాల్కన్స్‌'గా పిలుచుకుంటున్నారు. జర్మనీ నియంత హిట్లర్‌ సైతం ఓసారి పన్డేవాను పిలిచారని, ఆందోళనకు గురైన ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయారని అక్కడి ప్రజలు చెబుతారు. రెండో ప్రపంచయుద్ధంతో పాటు కొన్ని సంఘటనలను ముందే ఊహించి పన్డేవా చెప్పారు.

పన్డేవా ఊహించిన చెప్పిన జోస్యాల్లో 68 శాతం వరకూ నిజమయ్యాయని చెబుతుంటారు. అమెరికాలోని ట్విన్‌ ట్వవర్స్‌ను విమానాలతో కూల్చేస్తారని 1989లోనే బల్గేరియా మహిళ బాబా వాంగ పన్డేవా చెప్పడం విశేషం.

Did blind Bulgarian mystic Baba Vanga Predictions End of the world 5079

బాబా వాంగ పన్డేవా చెప్పిన జోస్యాల్లో నిజమైనవి:

* అమెరికా అధ్యక్షుడు కెన్నడీ, భారత ప్రధానులు ఇందిర, రాజీవ్‌ హత్యల గురించీ ముందే ఊహించి చెప్పారు.

* ‘లోహ విహంగాల దాడితో అమెరికా సోదరులు(ట్విన్‌ టవర్స్‌) కూలుతారు. పొద(అప్పటి అధ్యక్షుడు ‘బుష్‌'ను ఉద్దేశించి)లో తోడేళ్లు అరుస్తాయి. అమాయకుల రక్తం పారుతుంది' అంటూ 2001, సెప్టెంబరు 11న ట్విన్‌టవర్స్‌ కూల్చివేత గురించి 1989లోనే చెప్పారు.

* ‘‘ఓ పెద్ద అల తీరాన్ని కమ్మేస్తుంది. గ్రామాలు, ప్రజలు జలసమాధి అవుతారు'' అంటూ 2004లో థాయిలాండ్ తీరంలో సునామీ గురించి జోస్యం చెప్పారు.

* ఆగస్టు 1999 లేదా 2000లో కురుస్క్‌ నీటిలో మునిగిపోతుంది.

* ప్రపంచం కలవరానికి గురవుతుందని 1980లో చెప్పారు. 2000 ఆగస్టులో రష్యాకు చెందిన ‘కురుస్క్‌' అణు జలాంతర్గామి సముద్రంలో ప్రమాదానికి గురికావడంతో ప్రపంచదేశాలు వణికిపోయాయి.

* బల్గేరియా రాజు బోరిస్‌-3 ఆగస్టు 28, 1943న చనిపోతారని చెప్పగా.. 1944 ఆగస్టు 28న చనిపోయారు.

బాబా వాంగ పన్డేవా చెప్పిన భవిష్యత్ జోస్యాలు:

* 5079లో ఈ విశ్వం అంతమవుతుంది.

* 3797నాటికి భూమిపై మనిషి జాతి ఉండదు.

* 2018లో శుక్రుడిపై కొత్త ఇంధనం కనుగొంటారు.

* ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కమ్యూనిజం వ్యాప్తి చెందుతుంది.

* 2023లో భూమి కక్ష్య మారుతుంది. దీనివల్ల ధృవాల వద్ద మంచు కరిగి సముద్రాలు పొంగుతాయి.

* సిరియాలో మొదలయ్యే ఇస్లామిక్‌ వార్‌ 2043లో రోమ్‌ను స్వాధీనం చేసుకోవడంతో ముగుస్తుంది.

* ఈ సందర్భంలో యూర్‌ప ప్రజలంతా మృత్యువాతపడి, భూమిపై జాతి అనేది ఉండదు.

* 2130లో నీటిలో నివసించేలా గ్రహాంతరవాసులు మనుషులకు సాయం చేస్తారు.

* 3005లో అంగారకుడిపై యుద్ధం జరుగుతుంది.

* చంద్రుడిని తోకచుక్క ఢీకొంటుంది. భూమి చుట్టూ రాళ్లు, బూడిద వలయం ఏర్పడుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Did blind Bulgarian mystic Baba Vanga Predictions End of the world 5079.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more